Breaking News

నగ్నంగా కనిపించాలంటూ యువతికి వేధింపులు.. నీచానికి పాల్పడిన ఫ్రెండ్


ఇటీవల కాలంలో యువతను విపరీతంగా ఆకర్షించిన గేమ్ పబ్‌బీ. చాలామంది దీనికి బానిసై ఆత్మహత్య చేసుకోవడం, మతిస్థిమితం కోల్పోవడం వంటి ఘటనలు చాలా జరిగాయి. దీని ద్వారా అనేక మంది మహిళలు లైంగిక వేధింపులకు కూడా గురవుతున్నాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన ఓ యువతి సైబర్ కేటుగాడికి చిక్కి వేధింపులకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ యువతి(22) కొంత కాలంగా తన స్నేహితురాలితో కలిసి పబ్‌జీ గేమ్‌ ఆడుతోంది. ఈ క్రమంలో తన ఫ్రెండ్ ద్వారా జితేంద్ర అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. Also Read: ఇద్దరి మధ్య కొద్దిరోజులకే మంచి సంబంధం ఏర్పడటంతో ఒకరికొకరు ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. దీంతో ఆమె తన వ్యక్తిగత విషయాలన్నీ అతడితో పంచుకుంది. దాన్ని అడ్డం పెట్టుకుని జితేంద్ర బ్లాక్‌మెయిల్ చేయడంతో యువతి అతడితో మాట్లాడటం మానేసింది. దీంతో కక్ష పెంచుకున్న అతడు ఆమె ఫేస్‌బుక్, ఈమెయిల్ పాస్ట్‌వర్డ్స్‌ను హ్యాక్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు తన పాస్‌వర్డ్స్‌ను రీసెట్ చేయాలని కోరగా రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేకపోతే తనతో నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడాలని బెదిరించాడు. అతడి తీరుతో విసిగిపోయిన బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By June 14, 2020 at 08:07AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-blackmails-his-girlfriend-demands-nude-video-call-in-gujarat/articleshow/76365763.cms

No comments