ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో వెళ్లిబోయిన భార్య.. పోలీసులకు భర్త ఫిర్యాదు
సోషల్‌మీడియా కారణంగా ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయి. అనేక మంది ఫేస్‌బుక్‌లో పరిచయమైన వారి మోజులో పడి తమ సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఓ వివాహిత భర్తను వదిలేసి ఫ్రెండ్‌తో వెళ్లిపోవడం తీవ్ర కలకలం రేపింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: తాండూరు మండలం కోత్లాపూర్‌కు చెందిన విక్రమ్‌గౌడ్, అదే గ్రామానికి చెందిన అనితకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇంకా సంతానం కలగలేదు. ఈ క్రమంలోనే అనితకు కొంతకాలం క్రితం ఫేస్‌బుక్‌లో అలీ ఇమ్రాన్ షేక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. రోజూ అతడితో గంటల కొద్దీ ఛాటింగ్ చేస్తూ, ఫోన్లో మాట్లాడేది. గత నెల 26న అనిత కనిపించకుండా పోవడంతో విక్రమ్‌గౌడ్ ఆందోళన పడ్డాడు. బంధువులు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. Also Read: దీంతో తన భార్య ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తోనే వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానించాడు. వివరాలు తెలుసుకునేందు ఫేస్‌బుక్‌లో అతడి ప్రొఫైల్‌ను చెక్ చేయగా అకౌంట్ క్లోజ్ చేసినట్లు వచ్చింది. దీంతో అతడికి అనుమానం మరింత బలపడింది. గురువారం తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలీ ఇమ్రాన్‌షేక్ అనే వ్యక్తి తన భార్యను ఫేస్‌బుక్ ద్వారా ట్రాప్ చేసి తీసుకెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By June 05, 2020 at 08:21AM
No comments