అదనపు కట్నం కోసం వేధింపులు.. అత్తపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన కోడలు

అదనపు కట్నం కోసం వేధిస్తోందని అత్తపై కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన కోడలి ఉదంతం తమిళనాడులో వెలుగుచూసింది. పుదుకోట్టై జిల్లా మణియంబలం గ్రామానికి చెందిన అరంగులవన్ (60) టీ దుకాణం నడుపుతున్నాడు. ఆయన భార్య రాజమ్మాల్ (55). వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు రమేష్ (28) ఉన్నారు. మందుల దుకాణంలో పనిచేసే రమేష్‌కు వాణియంబాడికి చెందిన ప్రదీప(23)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు 7 నెలల పాప ఉంది. Also Read: గురువారం రాజమ్మాల్ మంటల్లో కాలుపోతుండటాన్ని గమినించిన స్థానికులు వెంటనే పుదుకోట్టై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ప్రదీపపై అనుమానం వచ్చింది. రాజమ్మాల్‌కు మంటలు అంటుకున్న సమయంలో ఇంట్లో ప్రదీప మాత్రమే ఉండటంతో ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అదనపు కట్నం కోసం తన అత్త రోజూ తీవ్రంగా వేధిస్తోందని, తన భర్తతో కూడా మాట్లాడనివ్వడం లేదన్న కోపంతోనే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ప్రదీపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:
By June 07, 2020 at 09:52AM
No comments