Breaking News

ఆ వైబ్రేష‌న్స్ అంతే.. మా ఇద్దరి మధ్య అండ‌ర్ స్టాండింగ్ ఎలాంటిదంటే: బాలకృష్ణ


నందమూరి నటసింహం , మాస్ డైరెక్టర్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ సాధించిన ఈ క్రేజీ జోడీ మరోసారి ఒక్కటైంది. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఓ సినిమాను రూపొందిస్తోంది. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ సినిమా నుంచి ‘బీబీ3 ఫస్ట్ రోర్’ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసి ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించారు మేకర్స్. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బోయపాటి మార్క్ చూపిస్తూ బాలయ్య చేత చెప్పించిన ఊరమాస్ డైలాగ్ నందమూరి ఫ్యాన్స్‌లో సరికొత్త హుషారు తెప్పించింది. ఈ వీడియో ఒక్క రోజులోనే 6 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్ దాటి ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్‌గా ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. ఇప్పటికీ ఆన్ లైన్ వేదికలపై హంగామా చేస్తూనే ఉంది. దీనిపై బాలకృష్ణ రియాక్ట్ అవుతూ తమ కాంబో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Also Read: ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ''మా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న‌ మూడో సినిమా ఇది. బోయ‌పాటి బాల‌కృష్ణ సినిమా అంటే ఆ వైబ్రేష‌న్స్ అంతే మరి. మా ఇద్దరి మధ్య మంచి అండ‌ర్ స్టాండింగ్ ఉంటుంది. ఫస్ట్ రోర్ చూశాక మీరంతా సినిమా కోసం ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారో తెలుసు. సాధార‌ణంగా నేను, బోయ‌పాటిగారు చాలా స్పీడుగా సినిమా పూర్తి చేస్తాం. షూటింగ్స్ మ‌ళ్ళీ స్టార్ట్ అయ్యాక ఈ సినిమాను రెట్టింపు వేగంతో పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. నా పుట్టిన రోజు సంద‌ర్భంగా విషెస్‌ తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికీ నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను'' అన్నారు.


By June 13, 2020 at 10:41AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-balakrishna-comments-on-pair-with-boyapati-srinu/articleshow/76352552.cms

No comments