Breaking News

కన్యగా వెళ్లి గర్భవతిగా తిరిగొచ్చింది... యువతిపై చిన్నాన్న పైశాచికం


వావి వరుసలు మరిచిన ఓ కామాంధుడు కూతురు వరుసయ్యే యువతిపైనే అత్యాచారానికి పాల్పడిన గర్భవతిని చేసిన దారుణ ఘటన విశాఖ నగరంలో వెలుగుచూసింది. విజయవాడకు చెందిన యువతి(19) విశాఖలోని జీవీఎంసీ ఐదో వార్డులో గల మారికవలసలో ఉంటున్న పిన్ని ఇంటికి గతేడాది ఆగస్టు నెలలో వచ్చింది. నాలుగు నెలల పాటు అక్కడే ఉంది. ఆ సమయంలో చిన్నాన్న వరుసయ్య పి.వాసు(36) ఆమెపై కన్నేశాడు. పిన్ని బయటకు వెళ్లిన సందర్భాల్లో యువతికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఇలా అనేకసార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. Also Read: నాలుగు నెలల తర్వాత యువతి విజయవాడలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రితో పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. దీంతో ఏం జరిగిందని ఆమెను ఆరా తీయగా ఆ కామాంధుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By June 05, 2020 at 07:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/19-yr-old-woman-raped-by-uncle-in-vizag-city/articleshow/76206444.cms

No comments