Breaking News

Balakrishna: మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తారా.. రారా? ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్న బాలయ్య


నందమూరి నట వారసుడు టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవైపు మిగతా ఫ్యామిలీల నుంచి వారసత్వంగా వచ్చిన హీరోలు దూసుకుపోతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి 9 మంది హీరో ఫామ్‌లో ఉంటే.. అక్కినేని, ఘట్టమనేని హీరోలు సత్తా చూపిస్తున్నారు. మరోవైపు బాలయ్య తరువాతి జనరేషన్‌లో మహేష్ బాబు వారసుడు గౌతమ్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయం కాగా.. పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరా కూడా హీరో అయ్యేందుకు రెడీ అవుతున్నారు. అయితే బాలయ్య వారసుడు మాత్రం గత ఐదేళ్ల నుంచి ఎంట్రీ ఇస్తారనే అంటున్నారు తప్ప ఆ వైపుగా అడుగులు పడటంలేదు. బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన బోయపాటి మోక్షజ్ఞ‌ను డైరెక్ట్ చేయబోతున్నారనే వార్తలు రాగా.. లక్కీ డైరెక్టర్‌గా పేరొందిన పూరీ అయితే కరెక్ట్ అని బాలయ్య భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై బాలయ్య స్పందిస్తూ తప్పకుండా మోక్షజ్ఞ‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని క్లారిటీ ఇచ్చారు. Read Also: ‘మోక్షజ్ఞ‌ సినిమాల్లోకి రావడానికి చాలా ఇంట్రస్ట్‌గా ఉన్నాడు.. డెఫనేట్‌గా సినిమాల్లోకి వస్తాడు. అతనికి వేరే దారిలేక కాదు.. సినిమాలంటే చాలా ఇంట్రస్ట్‌గా ఉన్నాడు. అతన్ని బలవంతంగా తోయడం లేదు.. సినిమాలంటే ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి ప్రోత్సహిస్తా.. మా నాన్న గారు నన్ను సినిమాల్లోకి రామని బలవంతం చేయలేదు.. నేను కూడా అంతే. నా కొడుకు ఇంట్రస్ట్ ఉందంటేనే ప్రోత్సహిస్తా అంటూ 2018లోనే తెలిపిన బాలయ్య.. తాజాగా మరోసారి మోక్షజ్ఞ‌ ఎంట్రీపై స్పందిస్తూ త్వరలోనే సినిమాల్లోకి వస్తాడని తెలిపారు. తదాస్తు దేవతులు ఎప్పుడు ఆశీర్వదిస్తే అప్పుడే.. దీనికి ప్రత్యేకించి ప్లానింగ్ అంటూ ఏం లేదు.. మంచి మూడ్ ఉంటే తీసుకొచ్చి కెమెరా ముందు నిలబెట్టేయడమే’ అంటూ మోక్షజ్ఞ‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు బాలయ్య. Read Also:


By June 04, 2020 at 10:32AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-balakrishna-about-his-son-mokshagna-debut/articleshow/76189077.cms

No comments