Breaking News

బైక్ షోరూమ్‌ను మేనేజర్‌ని చంపి రూ.22లక్షల దోపిడీ


ఓ షోరూమ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని దారుణంగా చంపేసిన దుండగులు అతడి నుంచి ఏకంగా రూ.22లక్షలు దోచుకున్న ఘటన తమిళనాడులో జరిగింది. తేనిలోని బంగ్లామేడు పెన్నిక్విక్‌ నగర్‌కు చెందిన అరుణ్‌కుమార్‌ (34) బైక్ షోరూంలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం షోరూం ఖాతా నుంచి నగదు డ్రా చేయడానికి పెత్తాట్చి వినాయక ఆలయం సమీపాన ఉన్న ఓ బ్యాంకుకు వెళ్లాడు. రూ.22 లక్షలు డ్రా చేసి షోరూమ్‌కు వచ్చిన తర్వాత అతడు మళ్లీ బయటకు వెళ్లి తిరిగిరాలేదు. డబ్బును కూడా షోరూం పద్దుల్లో జమ చేయలేదు. Also Read: దీంతో షోరూమ్ యాజమాన్యం తేని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు అరుణ్‌కుమార్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మలైకరట్టు కొండ దిగువభాగంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వరదరాజన్‌ సిబ్బందితో అక్కడకు వెళ్లగా అరుణ్‌కుమార్‌ హత్యకు గురై కనిపించారు. మృతదేహం పక్కన రక్తపు మరకలు ఉన్న సుత్తి, సెల్‌ఫోన్‌, కొంత దూరంలో ఆయన బైక్ కనిపించాయి. శరీరంపై వెనుకవైపు, ముఖంపై సుత్తితో దాడి చేసిన గాయాలు ఉన్నాయి. బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో నగదు డ్రా చేసినట్లు తెలుసుకున్న దుండగులు అతడిని వెంబడించి హత్య చేసి, నగదు తీసుకెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read:


By June 21, 2020 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bike-showroom-manager-murdered-in-tamil-nadu/articleshow/76489907.cms

No comments