Rana Daggubati: నేడే రానా, మిహీకా ఎంగేజ్‌మెంట్!
టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లలో రీసెంట్‌గా పెళ్లి కబురు చెప్పిన విషయం తెలిసిందే. తన గర్ల్‌ఫ్రెండ్ మిహీకా బజాజ్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసిన రానా.. తన ప్రేయసి, వ్యాపారవేత్త మిహికా బజాజ్ తన ప్రేమను అంగీకరించిందని తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో మిహికాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఎప్పుడన్న విషయంపై ఆయన తండ్రి, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందిస్తూ.. ఈ ఏడాదిలోనే కచ్చితంగా రానా పెళ్లి వేడుక జరపనున్నట్లు తెలిపిన ఆయన.. లాక్ డౌన్‌లో పెళ్లి పనులు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రామానాయుడు స్టూడియోలో జరగబోతుంది. రానా, మిహీకా కుటుంబ సభ్యులు మాత్రమే ఎంగేజ్‌మెంట్‌కి హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది.
By May 20, 2020 at 10:21AM
No comments