ఒక్క మగాడంటూ రెచ్చిపోయిన శ్రీముఖి.. విష్ణుప్రియ తోడుగా ఎంజాయ్!! ఆ ఇద్దరూ ఇంట్లోనే..
కరోనా విపత్కర పరిస్థితులను తమ తమ ఎంటర్టైన్‌మెంట్స్‌తో మరిపించే ప్రయత్నం చేస్తున్నారు పలువురు సెలబ్రిటీలు. ఇప్పటికే ఎందరో సినీ తారలు కరోనా పట్ల అవగానహన పెంపొందిస్తూనే తమ తమ డైలీ యాక్టివిటీస్‌తో ఆకట్టుకోగా, తాజాగా బుల్లితెర రాములమ్మ యాంకర్ .. మరో యాంకర్ విష్ణుప్రియతో కలిసి రెచ్చిపోయి చిందేసింది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ లేక ఇంట్లోనే ఉంటున్న ఈ ఇద్దరు లేడీ బ్యాచిలర్స్ యువత గుండెలకు బాణాలు వేసే డాన్స్ చేశారు. నేనంటే నేను అంటూ పోటీపడుతూ వీళ్లేసిన స్టెప్స్ చూసి ఆహా.. ఓహో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రతి రోజూ టీవీల్లో కనిపిస్తూ తమ అల్లరితో అందరినీ అలరించే ఈ ఇద్దరు లేడీ యాంకర్స్.. ఇప్పుడు ఆన్‌లైన్ వేదికపై దుమ్మురేపారు. షూటింగ్స్ లేకున్నా ఇలా కూడా ఆకట్టుకోగలం అనేలా హుషారెత్తించే చిందులేశారు. మొదట 'చిరుత కన్నుల వాడే' పాటకు డాన్స్ చేసి ఆ తర్వాత 'ఒక్క మగాడు', 'అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయె' పాటతో పరేషాన్ చేసేశారు. ఈ మూడు పాటలను మిక్స్ చేసి డాన్స్ మసాలాను ప్రేక్షకుల ముందుంచారు. ఇద్దరూ కలిసి మస్త్ ఎంజాయ్ చేస్తూనే తెగ హల్చల్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Also Read: ‘పటాస్’ షోతో బాగా పాపులర్ అయిన శ్రీముఖి.. ‘బిగ్‌బాస్’లో ఎంట్రీ ఇచ్చి ఆ క్రేజ్ రెట్టింపు చేసుకుంది. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపిస్తూ అలరిస్తోంది. ఆమె నటించిన తాజా సినిమా 'ఇట్స్ టైమ్ టు పార్టీ' విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. ఇక మరో యంగ్ బ్యూటీ యాంకర్ విష్ణుప్రియకు యూత్‌లో సూపర్ క్రేజ్ ఉంది. 'పోవే పోరా' ప్రోగ్రాంతో ఫేమస్ అయిన ఈ భామ.. తన హాట్ ఫిగర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. దీంతో ఆమె ఫాలోయింగ్ అమాంతం పెరిగింది.
By May 18, 2020 at 08:19AM
No comments