Breaking News

హృదయాల్ని కలిచివేసింది... విశాఖ దుర్ఘటనపై చిరంజీవి, మహేష్


విశాఖలో విష వాయువు దుర్ఘటనపై టాలీవుడ్‌కు చెందని ప్రముఖులంతా స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ దీనిపై స్పందించారు. విశాఖ లో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నానని చిరు ట్వీట్ చేశారు. లాక్ డౌన్ తర్వాత పరిశ్రమలు తెరిచేటప్పుడు సంబంధిత అధికారులంతా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు మెగాస్టార్. మెగాస్టార్‌కు ముందు టాలీవుడ్ ప్రముఖులు మంచు లక్ష్మీ, మంచు మనోజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి సైతం ఈ ఘటనపై స్పందించారు. విశాఖలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన తమను షాక్‌కు గురి చేసిందన్నారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని కోరుతూ వీరంతా ట్వీట్ చేశారు. తాజాగా మహేష్ కూడా ట్వీట్ చేశారు. వైజాగ్ గ్యాస్ లీక్ వార్తలు హృదయ విదారకంగా మారాయన్నారు. ప్రస్తుతం కరోనా వంటి వైరస్ విస్తరిస్తున్న సవాలు సమయాల్లో గ్యాస్ లీకేజ్ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. వాళ్లంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్థున్నాన్నారు.


By May 07, 2020 at 11:13AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-mahesh-babu-reactions-on-visakhapatnam-gas-leak/articleshow/75593275.cms

No comments