మరో బిగ్ సర్‌ప్రైజ్.. చంపేశారు.. బన్నీ ట్వీట్ చూడగానే! జబర్దస్త్ రియాక్షన్
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు స్తంభించిపోయాయి. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో నిత్యం తమ ఆటపాటలతో ఎంటర్‌టైన్ చేసే సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమై పోయారు. దీంతో ఇటు సినిమా థియేటర్స్, అటు క్రీడా ప్రాంగణాలు కళ తప్పాయి. అయినప్పటికీ తమ తమ అభిమానులను ఎంటర్‌టైన్ చేసేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు కొందరు సెలబ్రిటీలు. సోషల్ మీడియాను వాడేస్తూ డాన్సులు, ఇంటిపనులు, ఛాలెంజ్‌లు చేస్తూ స్పెషల్ కిక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియన్ క్రికెటర్, హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాడు తన భార్యతో కలిసి స్టెప్పులేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ, వాటిని టిక్ టాక్‌లో పోస్ట్ చేస్తూ అలరిస్తున్నారు. ఓ క్రికెటర్ సినిమా పాటలకు స్టెప్పులేస్తుండటం అందరినీ హుషారెత్తిస్తోంది. ఇటీవలే మూవీ 'అల.. వైకుంఠపురములో' నుంచి ''బుట్ట బొమ్మ'' పాటకు డాన్స్ చేసి ఇరగదీసిన డేవిడ్ వార్నర్.. మరోసారి అదే సినిమాలోని 'రాములో రాములా...' పాటకు కూడా డ్యాన్స్ చేసి బన్నీ అభిమానుల్లో ఊపు తెప్పించాడు. భార్యతో కలిసి ఆయన వేస్తున్న స్టెప్స్ అశేష సినీ, క్రీడాభిమానులను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Also Read: అయితే తన పాటలపై డేవిడ్ పర్‌ఫార్‌మెన్స్ చూసిన అల్లు అర్జున్ వెంటనే సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. "మరో బిగ్ సర్‌ప్రైజ్. మరోసారి ధన్యవాదాలు సర్.. చంపేశారు" అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చూసిన డేవిడ్ వార్నర్ స్పందిస్తూ ''ఏదో నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఆ పాట, డ్యాన్స్ నాకు బాగా నచ్చాయి'' అంటూ జబర్దస్ రియాక్షన్ ఇచ్చారు. వీళ్లిద్దరి సంభాషణ చూసి మరింత ఖుషీ అవుతున్నారు బన్నీ అభిమానులు.
By May 14, 2020 at 10:05AM
No comments