Breaking News

చిత్తూరులో దారుణం... చెత్తకుప్పలో మనిషి పుర్రె, ఎముకలు


చిత్తూరు జిల్లాలో భయ బ్రాంతులకు గురైన ఘటన చోటుు చేసుకుంది. జిల్లాలోని కుప్పంలో రోడ్డుపై ఉన్న చెత్తుకుప్పలో మనిషి అవశేషాలు కలకలం రేపాయి. రోడ్డుపై ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉన్న చెత్త కుప్పలో మనిషి పుర్రె, ఎముకలు లభ్యం అయ్యాయి. రోజులాగే ఇవాళ ఉదయం పారిశుధ్య పనులు చేసేందుకు మున్సిపల్ కార్మికులు వచ్చారు. చెత్త ఎత్తేందుకు చెత్తకుప్ప దగ్గరకు రాగానే... అందులో మనిషి అవశేషాలు వారికి కనిపించాయి. మనిషి పుర్రె,ఎముకలు కనపడగానే ఒక్కసారిగా వారు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఆ మున్సిపల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనిషి అవశేషాలను అక్కడి నుంచి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. అసలు రోడ్డుపైకి ఓ మనిషికి సంబంధించిన ఎముకలు ఎలా వచ్చాయన్నదానిపై పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ ఉన్న స్థానికులను, చుట్టుపక్కల వారిని కూడా పిలిచి ప్రశ్నిస్తున్నారు. దగ్గర్లో ఏమైనా స్మశానాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా రోజూ ఆ ప్రాంతాల్లో పనిచేసిన పారిశుధ్య కార్మికులను కూడా విచారిస్తున్నారు.గత కొన్నిరోజులుగా ఆ ప్రాంతంలో అనుమానాస్పద ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా అన్న దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. నడిరోడ్డుపై మనిషి పుర్రె ఉండటంతో స్థానికులు సైతం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


By May 04, 2020 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/human-skull-bones-found-in-dustbin-at-chittoor-district/articleshow/75526098.cms

No comments