Breaking News

కరోనా వైరస్ సోకినవారికి మెడనొప్పి, థైరాయిడ్ సమస్యలు.. అధ్యయనంలో వెల్లడి


సోకితే ఊపిరితిత్తుల్లో వాపు వచ్చి, ఫైబ్రోసిస్‌ వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కరోనా గుండె పనితీరునూ దెబ్బతీస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. తాజాగా, కరోనా వైరస్ బారినపడ్డవారికి థైరాయిడ్ సమస్యల కూడా తలెత్తే ముప్పు ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. సబ్అక్యూట్ థైరాయిడిటీస్ అనే తీవ్రమైన థైరాయిడ్ సమస్యకు దారితీస్తుందని తెలిపింది. సబాక్యూట్ థైరాయిడిటిస్ మెడ నొప్పికి కారణమవుతుంది. సాధారణంగా ఎగువ శ్వాసకోశ వ్యవస్థ వైరస్ సంక్రమణకు గురయినప్పుడు ఈ వ్యాధికి దారితీస్తుంది. గొంతు వద్ద ఉండే థైరాయిడ్‌ గ్రంథి కీలకమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. వైరల్‌ ఇన్ఫెక్షన్ల కారణంగా దీనిలో వాపు కనిపిస్తుంది. దవడ, చెవి, గొంతు వద్ద విపరీతమైన నొప్పితో పాటు జ్వరం కూడా వస్తుంది. ఈ సమస్య 20 నుంచి 50 ఏళ్ల మధ్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కోసారి ఈ గ్రంథి ఎక్కువ హార్మోన్‌ను విడుదలయ్యే అవకాశం ఉంది. కొన్నాళ్ల తర్వాత ఈ గ్రంథి యథాతథ స్థితికి చేరుతుంది. తాజా, అధ్యయనానికి సంబంధించిన పరిశోధన ఫలితాలను జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజమ్‌లో ప్రచురించారు. ఈ వ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ లేదా పోస్ట్-వైరల్ ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్ వల్ల సంభవించవచ్చని, అనేక వైరస్లు దీంతో ముడిపడి ఉంటాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఇటలీలోని పిసా యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. సార్స్-కోవ్-2 వైరస్ వల్ల కలిగే శ్వాసకోస వ్యవస్థపై ప్రభావం చూపే లక్షణాలతో ఒక మహమ్మారిగా రూపాంతరం చెందిందని, ఇతరు అవయవాలపై కూడా ఇంది ప్రభావం చూపుతోందని అన్నారు. సార్స్-కోవ్-2 వైరస్ సోకిన తర్వాత సబాక్యూట్ థైరాయిడిటీస్‌కు దారితీస్తున్న విషయాన్ని తామే తొలిసారి గుర్తించామని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ ఫ్రాన్సిస్కో లత్రోఫా తెలిపారు. కోవిడ్-19కు సంబంధించి కొత్త ఇబ్బందుల గురించి వైద్యులను మరింత అప్రమత్తం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ సోకిన ఓ 18 ఏళ్ల యువతిని వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పరిశోధకులు పరీక్షించారు. తన తండ్రి నుంచి వైరస్ సోకిన ఆమె.. చికిత్స అనంతరం నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్-19 నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే, కోవిడ్-19 నుంచి కోలుకున్నా ఇతర అనారోగ్య సమస్యలు ఆమెలో కనిపించాయని తెలిపారు. మెడ, థైరాయిడ్ నొప్పి, జర్వం, హృదయ స్పందన పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలియజేశారు. తర్వాత ఆమెను ఆస్పత్రిలో చేర్పించి పరీక్షించగా.. సబాక్యూట్ థైరాయిడిటిస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. అయితే, చికిత్స తర్వాత ఆ యువతికి థైరాయిడ్ సాధారణ స్థితికి నెలలోపే చేరిందని, దీనిని బట్టి సబాక్యూట్ థైరాయిడిటిస్‌కు సార్స్-కోవ్-2 కారణమవుతుందనే నిర్ధరాణకు వచ్చామని డాక్టర్ లత్రోఫో అన్నారు.


By May 23, 2020 at 09:57AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-infection-may-cause-thyroid-disease-italian-case-study-finds/articleshow/75910931.cms

No comments