దుస్తులు చించేసి కర్రలతో కొట్టి.. కన్నకూతురిపైనే పైశాచిక దాడి
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కన్నకూతురిపైనే ఓ వ్యక్తి బంధువులతో కలిసి విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై దుస్తులు చించేసి పైశాచికంగా ప్రవర్తించాడు. అల్లుడిని సైతం తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలూకాలోని గోపాలపుర గ్రామంలో మంగళవారం జరిగింది. భూ వివాదమే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. Also Read: తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలూకా గోపాలపుర గ్రామానికి చెందిన భైరప్ప కుమార్తె అమృతకు ఆరేళ్ల క్రితం సునీల్ అనే యువకుడితో వివాహం జరిగింది. దంపతులిద్దరూ బెంగళూరులో నివాసముంటున్నారు. మార్చి నెలలో అమృత భర్త సునీల్‌తో కలిసి గోపాలపురలోని పుట్టింటికి వచ్చింది. ఇంతలోనే కరోనా లాక్ డౌన్ అమల్లోకి రావడంతో దంపతులు అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలోనే భైరప్ప తన పొలంలో మట్టిని తవ్వించి వేరే వారికి విక్రయించాడు. ఈ విషయమై అమృత తండ్రిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో అమృత న్యాయం కోసం నోవినకెరె పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. Also Read: పోలీస్‌స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన అమృతతో భైరప్ప మళ్లీ గొడవపడ్డాడు. తన అన్నదమ్ములను బంధువులను పిలిపించి కూతురు, అల్లుడిపై కర్రలు, కత్తులతో దాడి చేయించాడు. వారు అమృత దుస్తులు చించేసి అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో ఆమె తల, భుజాలకు గాయాలై రక్తం ప్రవహించింది. సునీల్‌కు కూడా తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఇద్దరిని తిపటూరులోని ఓ అస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. తన తండ్రికి అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని, ఆస్తినంతా వారికి ధారపోస్తున్నందుకు ప్రశ్నిస్తే దాడికి పాల్పడ్డాడని అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By May 13, 2020 at 10:01AM
No comments