టవల్ చుట్టి బొట్ట బొమ్మ పాటకు స్టెప్పులేసిన క్రికెటర్
అల వైకుంఠపురము మ్యానియా ఆగడం లేదు. ఈ పాట ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. అంతేకాదు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్‌కు స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు క్రికెటర్లు సైతం బొట్ట బొమ్మ సాంగ్‌పై మనసు పారేసుకుంటారు. స్టార్ క్రికెటర్లు ఈ మధ్య తెలుగు, తమిళ, హిందీ సాంగ్స్ టిక్ టాక్ చేస్తూ తెగ హల్ చల్ చేస్తున్నారు. ఆసిస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి బొట్ట బొమ్మ సాంగ్‌కు స్టెప్పులేశాడు. ఇప్పుడు మరో క్రికెటర్ కూడా ఇదే పాటకు డాన్స్ వేసి అలరించాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ తనదైన శైలిలో డ్యాన్స్ చేశారు. కెవిన్ పీటర్సన్ కొద్ది రోజులుగా టిక్ టాక్‌లో అనేక వీడియోలు చేస్తూ నెటిజన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఇప్పటికే కెవిన్‌కి సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా బుట్టబొమ్మ సాంగ్‌కి హుక్ స్టెప్స్ వేసి అందరిని ఆశ్చర్యపరచాడు. నా డ్యాన్స్ మెరుగుపడుతుందా అంటూ వీడియోకి కామెంట్ కూడా ఇచ్చాడు. టవల్ కట్టి కెవిన్ వేసిన స్టెప్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బుట్టబొమ్మ సాంగ్ ఇటీవల 150 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ని క్రాస్ చేసింది. బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ బొట్ట బొమ్మ సాంగ్‌ను తన దైన స్టైల్లో పాడి.. మరోసారి తెలుగ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అల్లు అర్జున్, పూజహెగ్డే జంటగా నటించిన అలా వైకుంఠపురంలో సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ మరో పెద్ద ప్లస్ పాయింట్. సినిమా రిలీజ్‌కు ముందే వచ్చిన పాటలు...ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. మ్యూజిక్‌తో పాటు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా ఈ పాటల్ని ఖండాలు దాటేలే చేసింది. రిలీజ్ కి ముందే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సామ జవరగమనా, రాములో రాములా, బుట్ట బొమ్మా అనే సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించాయి.
By May 13, 2020 at 10:07AM
No comments