Breaking News

ఎన్టీఆర్ హీరోగా కాదు.. విలన్ పాత్రట!


బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ నిర్మాత సంజయ్ లీలా బన్సాలి భారీ బడ్జెట్‌తో హిస్టారికల్ మూవీని తెరకెక్కిస్తున్నారని.. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ అని రెండ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణవీర్ సింగ్ విలన్‌గా నటిస్తారని కూడా హిట్స్ వచ్చాయి. అంతేకాదు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే బుడ్డోడి బర్త్ డే రోజున అదిరిపోయే అప్డేట్ ఉంటుందని కూడా టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగు చూసింది.

అదేమిటంటే.. బన్సాలీ చిత్రంలో రణవీర్ సింగ్ హీరో అని.. ఆయనకు విలన్‌గా ఎన్టీఆర్‌ను తీసుకోనున్నారన్నదే ఆ అప్డేట్ యొక్క సారాంశం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ రేంజ్ పుకార్లు షికార్లు చేస్తున్నా ఎన్టీఆర్ నుంచి గానీ.. బన్సాలీ నుంచి గానీ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో రోజురోజుకూ వార్తలు ఎక్కువైపోతున్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ ఇలాంటి పుకార్లను పట్టించుకోడు. మీడియాపై ఎప్పుడు ఎలా సెటైర్లేయాలో అప్పుడు నవ్వుతూనే మాట్లాడేస్తాడు.

కాగా.. జూనియర్‌ను విలన్‌గా తీసుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయట. అందులో ఒకటి ‘జై లవకుశ’ సినిమా అట. ఇందులో ట్రిపుల్ రోల్‌లో నటించిన ఎన్టీఆర్.. ఏ రేంజ్‌లో ఇరగదీశాడో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఇటీవలే ఈ సినిమా చూసిన బన్సాలీ.. యంగ్ టైగర్‌ను విలన్‌గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే ఏరి కోరి మరీ బాలీవుడ్‌ను వదిలి టాలీవుడ్ మీద పడ్డాడట. ఇదే నిజమైతే మాత్రం బుడ్డోడి బాలీవుడ్ ఎంట్రీ పక్కా. అప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ కూడా రిలీజ్ అయిపోతుంది.. సెకండ్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజే అన్న మాట. ఇందులో నిజానిజాలెంతో జస్ట్ వెయిట్ అండ్ సీ.

 

 

ఎన్టీఆర్‌తో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ భారీ చిత్రం!

https://www.cinejosh.com/news-in-telugu/4/50871/bollywood-star-director-sanjay-leela-bhansali-jr-ntr-young-tiger-ntr-tollywood-bollywood.html



By May 04, 2020 at 03:48PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/50899/ntr.html

No comments