ఏపీలో ఆర్టీసీ బస్సు చోరీ.. పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన తాగుబోతు
జిల్లా ధర్మవరంలో ఆర్టీసీ బస్సు చోరీకి గురికావడం తీవ్ర కలకలం రేపింది. డిపోలో నిలిపి ఉంచిన ఏపీ02జడ్ 0552 నంబరు గల బస్సును ముజామిల్‌ఖాన్ అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం తీసుకెళ్లిపోయాడు. విషయాన్ని సెక్యూరిటీ కానిస్టేబుల్ సుష్మ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా బస్సు మామిళ్లపల్లి మీదుగా జాతీయ రహదారిపై ఆర్టీసీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ రమేష్‌బాబు సిబ్బందితో కలసి బస్సును చాలాదూరం వెంబడిస్తూనే ఎర్రమంచి పోలీసులకు సమాచారమిచ్చారు. Also Read: దీంతో ఎస్ఐ గణేష్ కియా వద్ద జాతీయ రహదారిపై కంటైనర్లను అడ్డం పెట్టారు. దీంతో ముందుకెళ్లే మార్గం లేకపోవడంతో ముజామిల్‌ఖాన్ బస్సును రోడ్డుపైనే ఆపేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో ఎర్రమంచి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ధర్మవరం టౌన్ ఎస్ఐ జగదీష్‌కు అప్పగించారు. నిందితుడు ముజామిల్‌ఖాన్ కర్ణాటకలోని విజయపుర ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు. శుక్రవారం సొంతూరు వెళ్లేందుకు ధర్మవరం డిపోకు మద్యం తాగి వచ్చిన ముజామిల్‌ఖాన్..అక్కడే నిలిపి ఉంచిన బస్సును నడుపుకుంటూ వెళ్లిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ధర్మవరం ఆర్టీసీ డీఎం మల్లికార్జున ఫిర్యాదుతో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By May 23, 2020 at 05:52AM
No comments