Breaking News

ఆర్థిక ఇబ్బందులు భరించలేక.. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య


కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ ప్రజలకు మరో విధంగా కష్టాలు తెచ్చిపెడుతోంది. పేదలు, వలస కూలీల కష్టాలపై ఫోకస్ పెడుతున్న ప్రభుత్వం మధ్య తరగతిని మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో సుమారు నెలన్నర రోజులుగా చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా తణుకుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆర్థిక ఇబ్బందులతో సోమవారం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. Also Read: స్థానిక బీసీ కల్యాణ మండపం సమీపంలో ఉంటున్న అందే దానయ్య (53) కొన్నాళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా వ్యాపారం సరిగ్గా సాగక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఇదే సమయంలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ అతడిని మరింత కుంగదీసింది. ఆర్థిక కష్టాలు ఎక్కువ కావడంతో భరించలేక సోమవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దానయ్యకు భార్య గీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నకుమారుడు 6 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్‌లో చనిపోయాడు. పెద్దకుమారుడు చైతన్య ఇచ్చిన ఫిర్యాదుతో తణుకు ఎస్ఐ కె.రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By May 05, 2020 at 08:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/real-estate-businessman-commits-suicide-in-tanuku-west-godavari-district/articleshow/75545981.cms

No comments