నిజమే! ఆగలేకపోతున్నా.. దానికోసమే వెయిటింగ్ ఇక్కడ.. కుండబద్దలు కొట్టేసిన మెగా డాటర్
మెగా బ్రదర్ నాగబాబు కూతురు, మెగా డాటర్ తన కెరీర్‌లో సరైన హిట్ సాధించాలని తెగ ఆరాటపడుతోంది. తెలుగులో హీరోయిన్‌గా ఇప్పటికే మూడు సినిమాలు చేసినా అవేవీ ఆశించిన ఫలితం రాబట్టలేదు. ఆయా సినిమాల్లో గ్లామర్ షోకి దూరంగా ఉండటమే అందుకు కారణం అనుకుందేమో గానీ.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాను గ్లామర్ తలుపులు తెరిచేందుకు సిద్దమే అని చెప్పింది మెగా డాటర్. అంతేకాదు ఈ మధ్యకాలంలో హీరోయిన్లకు ధీటుగా సోషల్ మీడియాను వేడెక్కించే ఫోటోలు షేర్ చేస్తోంది. తనలోని గ్లామర్ యాంగిల్ బయటపెట్టే ప్రయత్నంలో భాగంగా ఇటీవలే ఓ కుర్రాడితో మనోహర మ్యూజిక్‌పై రొమాంటిక్ డ్యాన్స్ వేసి స్పెషల్ కిక్ ఇచ్చింది. ఈ వీడియోతో తాను మునుపటిలా కాకుండా ఇలాంటి సాంగ్స్, పాత్రలు కూడా చేయగలనని దర్శకనిర్మాతలకు హింట్ ఇచ్చింది నిహారిక. ఇకపోతే ఆ మధ్య నిహారిక రెగ్యులర్‌గా చెన్నైకి వెళ్లి వస్తూ అక్కడ దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకోవడంతో ఓ రూమర్ స్ప్రెడ్ అయింది. ఆమెకు తమిళ సినిమా ఛాన్స్ వచ్చిందని అందుకే చెన్నై వెళ్లివస్తోందని వార్తలు వైరల్ అయ్యాయి. తమిళంలో హీరో అశోక్ సెల్వన్ హీరోగా రూపొందనున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా నిహారికను ఫైనల్ చేశారని, త్వరలోనే ఆ మూవీ సెట్‌పైకి వెళ్లనుందనేది ఆ వార్తల్లోని సారాంశం. దీంతో ఇదేంటి? నిహారిక తమిళ చిత్రసీమలోకి కూడా వెళుతోందా? అని చాలామందికి చాలా సందేహాలు కలిగాయి. ఈ క్రమంలో తాజాగా అలాంటి వార్తలపై కుండబద్దలు కొట్టేస్తూ స్వయంగా క్లారిటీ ఇచ్చింది నిహారిక. ''అవును నిజమే.. నాకు ఎంతో ఆత్రుతగా ఉంది.. షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుందా? అని ఆగలేకపోతోన్నా.. నా తదుపరి సినిమా ఓ మై కడవలే ఫేమ్ అశోక్ సెల్వన్‌తో ఉండనుంది. ఈ సినిమాతో స్వాతిని దర్శకురాలిగా పరిచయం కానుంది'' అని తెలుపుతూ ట్వీట్ చేసింది నిహారిక. ఈ ట్వీట్ చూసి ''సూపర్ మేడమ్, ఆల్ ది బెస్ట్'' అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
By May 04, 2020 at 08:02AM
No comments