కరోనా పోరాట యోధులకు అరుదైన గౌరవం.. త్రివిధ దళాలు పూల వర్షం
కరోనా వైరస్‌పై ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రపంచ మొత్తం సలాం చేస్తోంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో అలుపెరగని పోరాటం చేస్తున్న యోధులకు అరుదైన గౌరవం దక్కింది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులను వినూత్నంగా సత్కరించాయి. ఉత్తరాన కశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు.. తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమాన డయ్యూడామన్ వరకూ ఆసుపత్రులపై హెలీకాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. తొలుత వందన సమర్పణతో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. వాయిద్యాల నడుమ దేశంలోని అన్ని హాస్పిటల్స్ వద్ద కురిసింది. భారత నౌకాదళ (నేవీ) హెలీకాప్టర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. కరోనా వైరస్ సోకిన బాధితులకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి గౌరవసూచకంగా ఇండియన్ నేవీ ఆదివారం రాత్రి 7.30 నుంచి 11.59 వరకు నౌకలకు దీపాలంకరణ చేయనుంది. విశాఖ, కొచ్చిన్, చెన్నై, ముంబయి సహా దేశవ్యాప్తంగా ఉన్న పోర్టుల్లో నిలిచి ఉన్న నౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. కోవిడ్-19 ఆస్పత్రులపై పూలవర్షం కురిపించే కార్యక్రమంలో ఇండియన్ నేవీ యుద్ధ విమానాలు కూడా పాల్పంచుకున్నాయి. శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు ఓ బృందం, దిబ్రూగడ్ నుంచి కచ్ (గుజరాత్) వరకు మరో బృందం ఎంపిక చేసిన ఆస్పత్రులపై పూల వర్షాలు కురిపిస్తూ ముందుసాగాయి. ఒక్కో బృందంలో 6 ఫైటర్ జెట్ ఎయిర్ క్రాప్ట్‌లు ఉన్నాయి. ఆదివారం ఉదయం వార్ మెమోరియల్, పోలీస్ మెమోరియళ్ల వద్ద నివాళులు అర్పించిన అనంతరం కార్యక్రమం ప్రారంభమైంది. కరోనాపై పోరాటం సాగిస్తున్న డాక్టర్లు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసు సిబ్బందికి సంఘీబావం తెలిపి, త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి.
By May 03, 2020 at 10:35AM
No comments