Breaking News

సెలవుల్లో ఇంటికొచ్చిన కూతురు... కామంతో రెచ్చిపోయి రేప్ చేసిన తండ్రి


కన్నకూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. వావి వరుసలు మరిచి ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని జిల్లాలో జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (13) తల్లి పదేళ్ల క్రితమే మృతి చెందింది. అనంతరం తండ్రి (37) మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో కూతురును దోమ మండలంలోని ఓ పాఠశాలలో ఉంచి చదివిస్తున్నాడు. మార్చిలో లాక్‌డౌన్‌ కారణంగా కూతురు ఇంటికి వచ్చేసింది. కామంతో కన్న కూతురిపైనే కన్నేసిన ఆ దుర్మార్గుడు రంజాన్ రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. Also Read: బాలిక రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని పెద్దమ్మ ఇంటికి వచ్చింది. ఆమె దీనంగా ఉండటాన్ని గమనించిన పెద్దమ్మ ఏం జరిగిందని అడగ్గా తండ్రి తనపై జరిపిన అఘాయిత్యాన్ని వివరించింది. దీంతో ఆమె గ్రామానికి చేరుకుని బాలిక నాయనమ్మకు విషయం చెప్పింది. బంధువులందరూ కలిసి ఆ కీచక తండ్రిని నిలదీశారు. అనంతరం తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read:


By May 30, 2020 at 08:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/13-yr-old-girl-raped-by-father-in-vikarabad-district-accused-arrested/articleshow/76101850.cms

No comments