విడాకులకు అప్లై చేసిన భార్య.. మనస్తాపంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
భార్యతో విడాకులు తీసుకోవాల్సి వస్తుందన్న మనస్తాపంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా సత్తుపల్లిలో చోటుచేసుకుంది. సత్తుపల్లిలోని రాజీవ్‌రోడ్డులో నివాసం ఉంటున్న సింగరేణి ఉద్యోగి శంకర్ వరప్రసాద్, సూర్యకళ దంపతులకు వీరవెంకట ప్రత్యూష్(30) సంతానం. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అతడికి నాలుగేళ్ల క్రితం విజయనగరానికి చెందిన యువతితో వివాహం జరిగింది. ఏడాది కాలంగా వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఆరు నెలల క్రితం ప్రత్యూష్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడి నుంచి మెడిసిన్ పీజీ కోర్సు చదివేందుకు బెంగళూరు వెళ్లింది. Also Read: భర్తతో కలిసి బ్రతలేనని నిర్ణయించుకున్న ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసింది. అప్పటి నుంచి ప్రత్యూష్ తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. లాక్‌డౌన్ కారణంగా సత్తుపల్లికి వచ్చేసిన అతడు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. అయితే లాక్‌డౌన్ అనంతరం విడాకులు తీసుకోవాల్సి వస్తుందని లోలోపలే మదనపడుతున్నాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By May 19, 2020 at 08:04AM
No comments