Breaking News

హమారా బజాజ్ అంటూ.. రానా పెళ్లి వార్తలపై నాని సెటైర్లు


టాలీవుడ హీరో రానా కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలో తన బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలికేస్తున్నాడు. ఈ విషయాన్ని రానాయే స్వయంగా ట్విట్టర్లో పోస్టు చేశాడు. హైదరాబాద్‌కు చెందిన మిహీక బజాజ్‌ అనే యువతితో ప్రేమలో ఉన్నట్లు రానా మంగళవారం సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేసి.. ఆమె యస్‌ చెప్పిన విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు రానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే నేచురల్‌ స్టార్‌ నాని చేసిన సరదా ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. 'ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020 లో' అని సరదాగా పేర్కొంటూ బజాజ్‌ కంపెనీకి సంబంధించిన ఓ పాత యాడ్ వీడియోను జతచేసి.. 'జోక్స్‌ పక్కకు పెడితే సూపర్‌ బాబాయ్‌' అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక ఈ పోస్ట్‌ ఫన్నీగా ఉండటంతో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. రానాకు కాబోయే భార్య మిహీక బజాజ్‌ డ్యూ డ్రాప్‌ పేరిట ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. మిహీకా పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. మూడేళ్ల క్రితం వరకూ ఆమె హైదరాబాద్‌లోనే ఉండేది. చెల్సియా యూనివర్శిటీలో ఇంటీరియల్ రిజైన్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత తన తల్లి వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్‌లో కీలకంగా ఉండేది. 2017లో ఆమె ‘డ్యూ డ్రాప్ డిజైన్’ అనే ఈవెంట్ కంపెనీని సొంతంగా ర‌న్ చేసి యంగ్ బిజినెస్ ఉమెన్‌గా సత్తా చాటింది. ఇప్పటివరకు రానా మాత్రం మిహీకకు సంబంధించి ఎలాంటి విషయాలు బయట పెట్టలేదు. ప్రస్తుతం విరాట పర్వం, అరణ్య సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి వీరిద్దరు పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో చూడాల్సిందే. మొత్తానికి టాలీవుడ్‌లో మరో యంగ్ హీరో పెళ్లి పీటలెక్కడంతో పరిశ్రమలో కూడా సందడే సందడి కనిపిస్తోంది. ఓ వైపు నితిన్, నిఖిల్ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పుడు రానా ఇంట కూడా పెళ్లి బాజాలు త్వరలోనే మోగనున్నాయి.


By May 13, 2020 at 09:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-nani-satires-on-rana-marriage-with-posting-bajaj-old-add/articleshow/75708445.cms

No comments