Breaking News

ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్.. మన్మోహన్‌కు కరోనా నిర్ధారణ పరీక్ష


మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (87) స్వల్ప అస్వస్థతతో ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయన పూర్తిగా కోలుకోవడంంతో మంగళవారం మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. కొన్ని కొత్త ఔషధాలను వాడటం వల్ల మాజీ ప్రధాని అస్వస్థతకు గురైనట్లు గుర్తించిన వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఫలితాల్లో నెగిటివ్‌ వచ్చింది. మన్మోహన్ పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు డిశ్చార్జ్ చేసినట్టు వర్గాలు వెల్లడించాయి. ఆదివారం రాత్రి కార్డియో-థైరాసిస్ వార్డులో మన్మోహన్‌ను చేర్పించిన వైద్యులు ఆయనకు చికిత్స అందజేశారు. అనంతరం సోమవారం సాయంత్రం ప్రయివేట్ వార్డుకు మార్చారు. ఆదివారం రాత్రి 8.45 గంటల సమయంలో ఆయనను ఆస్పత్రికి తరలించగా.. గుండె చికిత్స విభాగంలో కార్డియాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నితీశ్‌ నాయక్‌ పర్యవేక్షణలో వైద్యం చేశారు. మార్చిలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు వాయిదా పడటానికి ముందే మన్మోహన్‌సింగ్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వ్యక్తిగత వైద్యులు సూచించారు. 2009లోనూ మన్మోహన్‌సింగ్‌కు ఎయిమ్స్‌లో బైపాస్‌ సర్జరీ జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మన్మోహన్ 2004 నుంచి 2014 వరకు రెండుసార్లు ప్రధానిగా ఉన్నారు.


By May 13, 2020 at 09:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/former-pm-congress-senior-leader-manmohan-singh-discharged-from-aiims-on-tuesday/articleshow/75708174.cms

No comments