Breaking News

ప్రియుడిని కత్తితో పొడిచి యువతి ఆత్మహత్యాయత్నం.. కృష్ణా జిల్లాలో ఘటన


కృష్ణా జిల్లాలో ఓ ప్రేమ జంట వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ప్రియుడు కత్తిపోట్లకు గురికాగా, యువతి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికి వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మండలంలోని వక్కలగడ్డలో జరిగింది. బందరు ఇంగ్లీషుపాలెం గ్రామానికి చెందిన మాగంటి నాగలక్ష్మి, గూడూరుకు చెందిన గొరిపర్తి పవన్‌కుమార్‌ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాగలక్ష్మి బందరులోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుండగా, పవన్‌కుమార్‌ పెడన తహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. Also Read: రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్న వీరిద్దరు ఇటీవల చల్లపల్లి మండలంలోని వక్కలగడ్డలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. సోమవారం ఆ ఇంటివద్ద యువకుడు కత్తిపోట్లకు గురై ఉండడం, యువతి నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువతిని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి, యువకుడిని చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించిం చికిత్స అందించారు. కాసేపటికి తేరుకున్న పవన్‌కుమార్ నుంచి పోలీసులు పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. కొన్నాళ్లుగా నాగలక్ష్మి పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తెస్తుండగా తాను తిరస్కరిస్తూ వస్తున్నానని చెప్పాడు. Also Read: అయితే చివరిసారిగా కలసి మాట్లాడుకుందామని ఆమె పిలిస్తే సోమవారం ఉదయం వక్కలగడ్డకు వచ్చినట్లు తెలిపాడు. పెళ్లి చేసుకొని ఇద్దరం కలసి బతుకుదాం లేకపోతే కలసి చనిపోదామని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో నాగలక్ష్మి తనపై కత్తితో దాడి చేసి తాను నిద్రమాత్రలు మింగిందని పోలీసులకు చెప్పాడు. చల్లపల్లి సీఐ ఎన్‌.వెంకటనారాయణ, ఎస్ఐ నాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By May 26, 2020 at 08:31AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-stabs-boyfriend-before-try-to-suicide-in-krishna-district/articleshow/75990464.cms

No comments