భారత్‌లో కరోనా విజృంభణ.. కొత్తగా 6 వేలకుపైగా కేసులు
భారత్‌లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 6535 కొత్త కేసులు నమోదు కాగా.. 146 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్‌లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1.45 లక్షలు దాటింది. ఇప్పటి వరకూ మనదేశంలో 4167 మంది కోవిడ్ వల్ల మరణించారు. దేశంలో ప్రస్తుతం 80 వేేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన దేశంలో కోవిడ్ రికవరీ రేటు 42.6 శాతానికి చేరింది. ప్రపంచంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ టాప్-10లోకి చేరిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 55.86 లక్షల మంది ఇన్ఫెక్షన్ బారిన పడగా.. 3.47 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కొత్తగా 2436 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 52,667కు చేరింది. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 1186 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 60 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 1695 మంది కోవిడ్‌కు బలి కాగా.. 15,786 మంది డిశ్చార్జ్ అయ్యారు. ముంబై నగరంలోనే కొత్తగా 1430 కేసులు నమోదు కాగా.. దేశ ఆర్థిక రాజధానిలో కోవిడ్ కేసుల సంఖ్య 32 వేలకు చేరువలో ఉంది. ముంబై నగరంలో వెయ్యి మందికిపైగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
By May 26, 2020 at 08:59AM
No comments