Breaking News

అందాల ఆరబోతకు నేను రెడీ కానీ.. : పేతురాజ్


నేచురల్‌ బ్యూటీ నివేదా పేతురాజ్‌ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో నటించింది అరకొర సినిమాలే అయినా ఈ బ్యూటీకి పిచ్చ ఫాలోయింగ్ ఉంది. సోలోగా అవకాశం రాలేదు కానీ.. వచ్చుంటే మాత్రం తన రేంజ్, తన నటన ఏంటో చూపించేదాన్ని అని ఈ బ్యూటీ తెగ బాధపడుతోంది. ప్రతి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించాలని అడుగుతండటం.. కాదనలేక వచ్చిందే అవకాశంగా నటించేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సంక్రాంతికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ‘అల వైకుంఠపురములో..’ సినిమాలో దుమ్ముదులిపేసింది. ఈ యాక్టింగ్‌కు ఇటు బన్నీ.. అటు సుశాంత్.. సినిమా చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

మనసులో మాట..

ప్రస్తుతం లాక్‌డౌన్ కావడంతో నటీనటులు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అభిమానులు చిట్ చాట్ చేస్తూ.. మరోవైపు ఆన్‌లైన్ ద్వారా మీడియాకు ఇంటర్వ్యూలు తెగ ఇచ్చేస్తున్నారు. తాజాగా నివేదా పేతురాజ్ కూడా ఓ ప్రముఖ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన మనసులోని మాటను ఈ బ్యూటీ బయటపెట్టేసింది. తాను ఇంతవరకూ చేసిన పాత్రల కారణంగా గ్లామరస్‌గా కనిపించాల్సిన అక్కర్లేదని.. ‘అల వైకుంఠపురములో’ కూడా తానేం గ్లామర్‌గా కనిపించలేదని చెప్పుకొచ్చింది. కచ్చితంగా గ్లామర్‌గా కనపడాల్సిందే అనే పరిస్థితి వస్తే మాత్రం అందాల ఆరబోతకు తాను సిద్ధంగానే ఉన్నానని మనసులోని మాటను బయటపెట్టింది. అలా ఆరబోస్తే అవకాశాలు గట్టిగా వస్తాయని మాత్రం తాను నమ్మనని చెప్పింది. పాత్రకు ఎంత కావాలో అంతే రీతిలో కనిపించి మెప్పించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. మొత్తానికి చూస్తే మనసులోని మాటను బయటపెట్టేసిందన్న మాట. 

రెండు సినిమాల్లో..

ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబోలో వస్తున్న మూవీలో నివేదా సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటీనటులుగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ సినిమాలోనూ సెకండ్ హీరోయిన్‌గా నివేదాను తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రష్మిక మెయిన్ హీరోయిన్‌గా.. నివేదా ఫ్లాష్ బ్యాక్‌లో హీరోయిన్‌గా తీసుకున్నట్లు లీకులు వస్తున్నాయ్. రెండూ కూడా మెగా హీరోల సినిమాలే. ఇదే నిజమైతే పవన్ సరసన ఫస్ట్ టైమ్ కాగా.. బన్నీ సరసన మాత్రం రెండోసారి నివేదా నటించబోతోంది. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.



By May 02, 2020 at 07:49PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/50872/nivetha-pethuraj.html

No comments