Breaking News

బాలీవుడ్‌లోనూ భారీగానే పూజా పారితోషికం!


టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దే. ‘నాకు నేనే పోటీ.. నాకెవ్వరూ లేరు సాటీ, పోటీ’ అంటూ అందాల దూసుకెళ్తోంది. ఇప్పటికే స్టార్ హీరోల సరసన నటించి సూపర్ డూపర్ హిట్‌లు తన ఖాతాలో వేసుకుంది. అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ మహేశ్ బాబులతో ఇప్పటికే నటించేయగా.. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో నటిస్తోంది. అలా స్టార్‌ల సరసన నటించి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా నిలిచిపోయింది. టాలీవుడ్‌ను దున్నేసిన ఈ భామకు బాలీవుడ్‌పై బాగా మోజు పెరిగింది. అందుకే ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్.. బాలీవుడ్ అని తెగ కలవరిస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో గట్టిగానే పారితోషికం పుచ్చుకుంటున్న ఈ భామ.. బాలీవుడ్‌లో ఏ మాత్రం తీసుకుంటోంది.. అక్కడి నిర్మాతలు ఏ మాత్రం ఇచ్చుకుంటున్నారనేది నెట్టింట్లో చర్చ జరుగుతోంది. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏదైనా సరే పారితోషికం విషయంలో మాత్రం అస్సలు ఈ భామ కాంప్రమైజ్ కాదట. టాలీవుడ్‌లో ఎంత తీసుకుంటుందో  అంతకుమించే తీసుకుంటుందే తప్ప తక్కువ తీసుకోవట్లేదట. తెలుగులో సినిమాలకు రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయిలు తీసుకునే పూజా.. బాలీవుడ్‌లో మాత్రం మూడు నుంచి మూడున్నర కోట్ల దాకా తీసుకుంటోందట. అంటే కోటి రూపాయిలు ఎక్కువే.

ఎందుకంటే బాలీవుడ్‌లో బికీనీలతో పాటు బెడ్రూమ్ సీన్స్‌లో నటించాల్సి ఉంటుందని అందుకే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదట. ఈ మధ్యే ఓ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంప్రదించగా.. ఈ రేటుకు అయితే చేస్తానని లేకుంటే చేయనని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేసిందట. సరిగ్గా రెండు మూడు సినిమాల్లో కూడా ఇక్కడ నటించలేదు అప్పుడే అంత డిమాండ్ పెరిగిపోయిందేంటబ్బా అని ఆలోచనలో పడ్డాడట. ఎవరికైనా సరే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఎందుకుండదు మరి.



By May 02, 2020 at 08:10PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/50873/pooja-hegde.html

No comments