భద్రాద్రి జిల్లాలో విషాదం.. చెరువులో మునిగి ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో మంగళవారం తీవ్ర విషాద ఘటన జరిగింది. చెరువులో ముగినిపోతున్న ఓ వ్యక్తిని కాపాడబోయి ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు నల్లమోతు అప్పారావు(40) కూరగాయలు సాగు చేశాడు. పురుగుమందు కొట్టేందుకు ఉదయం తండ్రి కృష్ణయ్య, కుమారుడు తేజేష్ (21), మేనల్లుడు(చెల్లెలి కుమారుడు) జాగర్లమూడి వినయ్‌కుమార్(17)తో కలిసి పొలానికి వెళ్లాడు. అందరూ కలిసి తోటకు పురుగుమందు కొట్టారు. అనంతరం కాళ్లు, చేతులు కడుక్కునేందుకు రేపాక చెరువు వద్దకు వెళ్లారు. Also Read: వినయ్‌కుమార్ చెరువులో దిగి ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. గమనించిన తేజేష్ అతణ్ని బయటికి లాగేందుకు ప్రయత్నించి తానూ జారిపోయాడు. వీరిద్దర్నీ కాపాడేందుకు యత్నించిన అప్పారావు కూడా చెరువులోకి దిగి నీట మునిగిపోయాడు. తర్వాత వీరిని కాపాడే ప్రయత్నంలో కృష్ణయ్య కూడా నీటిలో మునిగిపోతుండగా స్థానికులు గమనించి బయటకు తీశారు. వీరందరికీ ఈత రాకపోవడం, చెరువులో లోతైన గుంతలు ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. ఒకేసారి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. Also Read:
By May 20, 2020 at 08:03AM
No comments