చిచ్చుపెట్టిన సామాజిక వర్గం.. ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటై జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు. కానీ సామాజిక వర్గాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరన్న ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే యువతికి పెద్దలు వేరే యువకుడితో వివాహం నిశ్చయించారు. దీంతో కలిసి బ్రతకలేమని అర్ధం చేసుకున్న ఆ ప్రేమికులు కలిసి చావాలనుకుని నిర్ణయించుకున్నారు. దీంతో వారి ప్రేమ ప్రయాణం విషాదాంతమైంది. ఈ ఘటన జిల్లా మండలంలో ఆదివారం వెలుగుచూసింది. Also Read: ఉరవకొండ మండలం కౌకుంట్లకు చెందిన సోమశేఖర్ కూతురు సుస్మిత(20), కణేకల్లు మండలం తుంబిగనూరు గ్రామానికి చెందిన రామన్న కొడుకు రవి (25) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రవి కౌకుంట్లలోని తన అక్క ఇంట్లో ఐదేళ్లుగా ఉంటూ గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరి సామాజిక వర్గాలు వేరు. ఈ క్రమంలో సుస్మితకు తల్లిదండ్రులు వేరొక యువకుడితో కొద్దిరోజుల క్రితం వివాహం నిశ్చయించారు. దీంతో తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించిన ప్రేమికులు ఆదివారం ఉదయం రవి బంధువుల ఇంట్లో ఒకేతాడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. Also Read: వారి ఇళ్లల్లోని అందరూ పనుల నిమిత్తం బయటకు వెళ్లిపోవడంతో ఈ విషయాన్ని గమనించలేదు. స్థానికంగా ఉండే యువకుడు ప్రేమికులు తాడుకు వేలాడుతున్న దృశ్యాన్ని చూసి వారి బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారు వెళ్లి చూడగా అప్పటికే రవి, సుస్మిత చనిపోయారు. ఉరవకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో విషపు గుళికలు కనిపించడంతో వారిని మింగిన తర్వాత ఉరేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లాక్‌డౌన్ వేళ ప్రశాంతంగా ఉన్న కౌకుంట్ల గ్రామంలో ప్రేమికుల ఆత్మహత్యతో విషాదం నెలకొంది. తల్లిదండ్రులకు సుస్మిత ఏకైక సంతానం కావడంతో గారాబంగా పెంచారు. దీంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. Also Read:
By May 04, 2020 at 08:06AM
No comments