ప్రకాశం: బావను చంపిన బామ్మర్ది.. కారణం తెలిసి పోలీసులు షాక్
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. బావ, బావమరిది మధ్య రేగిన చిన్న వివాదం హత్యకు దారి తీసింది.. దీనికి కారణం తెలిసి పోలీసులే షాక్ తిన్నారు. పెద్దారవీడు మండలం చెంచుగిరిజన కాలనీకి చెందిన మండ్ల రాజయ్య, కుడుముల చెన్నయ్య వరుసకు బావ, బావమరిదులు. రాజయ్య తన బావమరిది చెన్నయ్య దగ్గర కొద్దిరోజుల క్రితం రూ.2 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలో మళ్లీ డబ్బు తిరిగి చెల్లించమని రాజయ్యపై చెన్నయ్య ఒత్తిడి తీసుకొస్తున్నాడు. తన అప్పు తిరిగి చెల్లించకపోవడంతో చెన్నయ్య బావ రాజయ్యపై గుర్రుగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య శుక్రవారం గొడవ జరిగింది. కోంతో ఊగిపోయిన చెన్నయ్య తన దగ్గర ఉన్న బాణం వేయడంతో.. రాజయ్య శరీరంలో బలంగా దిగింది. అతడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. చెన్నయ్య అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ.2వేల కోసం నిండు ప్రాణం బలి అయ్యింది.
By May 23, 2020 at 08:24AM
No comments