ప.గో.జిల్లాలో కీచక తండ్రి.. కామంతో కూతురిపైనే అనేకసార్లు అత్యాచారం
కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిగా మారాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపైనే అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జిల్లాలో వెలుగుచూసింది. పెదవేగి మండలంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న దంపతులకు కుమార్తె(14) ఉంది. కూతురునే కామంతో చూసిన ఆ తండ్రి భార్య లేని సమయంలో బాలికను బెదిరించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తల్లికి చెబితే ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. ఆ కొంతకాలంగా కొనసాగుతున్న తండ్రి వికృత చేష్టలను భరించలేకపోయిన బాలిక ఈ నెల 16వ తేదీన ఇంటి పారిపోయింది. Also Read: వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమె నుంచి వివరాలు సేకరించాడు. న్యాయం చేస్తానని చెప్పి ఏలూరులోని ఓ గదిలో ఉంచి ఆమె తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో బాలిక తల్లి ఏలూరు చేరుకుని ఇంటి నుంచి ఎందుకు పారిపోయావని నిలదీసింది. దీంతో బాలిక తండ్రి తనపై సాగిస్తున్న కీచకపర్వాన్ని చెప్పి బోరుమంది. గదిలో ఉంచిన వ్యక్తి కూడా తనపై అత్యాచారానికి యత్నించాడని చెప్పింది. దీంతో బాలిక తల్లి గురువారం ఏలూరులోని దిశ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. Also Read: డీఎస్పీ పైడేశ్వరరావు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే తనపై కేసు నమోదైందని తెలుసుకున్న బాలిక తండ్రి ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు అతడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. బాలికను గదిలో ఉంచిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, అతడి కోసం గాలిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read:
By May 22, 2020 at 08:22AM
No comments