ఆరేళ్లు కాపురం చేసి అనుమానంతో భార్య హత్య.. ప.గో జిల్లాలో దారుణం
పశ్చిమ గోదావరి జిల్లా మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని ఆరేళ్లు కాపురం చేసిన భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను అతి కిరాతకంగా చంపేశారు. పిప్పర గ్రామానికి చెందిన బోయిన నరేష్ అదే గ్రామానికి చెందిన కాకిలేటి శ్రీను, అన్నపూర్ణ దంపతుల కుమార్తె వెంకటరమణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్ల వీరి సంసార జీవితానికి ప్రతిఫలంగా పావని దుర్గ, హర్ష అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. కొంతకాలంగా మద్యానికి బానిసైన నరేష్ భార్యపై అనుమానం పెంచుకుని వేధిస్తున్నాడు. ఆమెకు ఇతరులతో అక్రమ సంబంధాలు అంటగట్టి చిత్రహింసలు పెడుతున్నాడు. Also Read: సోమవారం కూడా మద్యం తాగి ఇంటికొచ్చిన నరేష్ భార్యను కొట్టాడు. దీంతో ఆమె అలిగి అదే గ్రామంలో ఉండే తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. మంగళవారం మధ్యాహ్నం మద్యం మత్తులో నరేష్ అత్తారింటికి వెళ్లి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణను తల్లిదండ్రులు, స్థానికులు పిప్పర పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న నరేష్ నేరుగా గణపవరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లి హత్యకు గురవడం, తండ్రి అరెస్ట్ కావడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. Also Read:
By May 20, 2020 at 08:27AM
No comments