Breaking News

శిరీష్‌పై దృష్టిపెట్టిన అల్లు అరవింద్!


మెగా ఫ్యామిలీ నుంచి క్రికెట్‌ టీమ్ కంటే ఎక్కువగా హీరోలు వచ్చినప్పటికీ ఒకరికద్దరు తప్ప దాదాపు అందరూ సక్సెస్ అయ్యారు. ఇంకొంత మంది సక్సెస్‌కు దగ్గర్లో ఉన్నారు.  అయితే ఈ టీమ్‌లోని అల్లు శిరీష్‌కు మాత్రం ఇప్పటి వరకూ సరైన హిట్ పడలేదు. దూసుకుపోవడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, నిదానమే ప్రధానం అన్నట్టుగా సినీ కెరీర్‌ను నడిపించేస్తున్నాడు. అటు ‘అన్నయ్య’ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యమా స్పీడ్‌తో దూసుకెళ్తుండటం.. ఇటు శిరీష్ మాత్రం చాలా స్లోగానే బండి నడిపించేస్తున్నాడు. ఇన్నిరోజులూ బన్నీపైనే దృష్టిపెట్టిన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. అర్జున్‌ను ఇకపై పెద్దగా పట్టించుకోనక్కర్లేదని ఇక శిరీష్‌ను స్టార్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. 

కొన్ని పరిణామాలు..

అందుకే ఈ మధ్య లాక్‌డౌన్‌లోనూ వరుసగా కథలు వింటున్నాడని తెలియవచ్చింది. ఇన్నిరోజులూ చూసి చూడనట్లు.. అంతగా పట్టించుకోని అరవింద్ ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా దృష్టిపెట్టాడట. ఇందుకు కారణం ఆయన ఇంట్లో జరిగిన కొన్ని పరిణామాలేనని టాక్ నడుస్తోంది. ఆ పరిణామాలేంటి..? అసలేం జరిగింది..? అనేవి ఇక్కడ అసందర్భం.. అప్రస్తుతం!. ఇప్పటికే మూడు, నాలుగు కథలు అరవింద్-శిరీష్ విన్నారట. అందులో రెండు కథలు మాత్రం చాలా బాగా నచ్చాయట. ఇందులో మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ సినిమాను తెరకెక్కించి ఫర్లేదు అనిపించుకున్న రాకేశ్ శశి కథ ఒకటయితే.. మరోటి బొమ్మరిల్లు భాస్కర్ కథ బాగా నచ్చిందట. మిగిలిన రెండు కథల్లో ఫలానా మార్పులు చేర్పులు చేయాలని అరవిందే చెప్పాడట.

కథలు ఇలా ఉంటాయట..

శశి-శిరీష్ కాంబోలో అనుకుంటున్న చిత్రం బాగా ఎమోషనల్‌గా ఉంటుందట. ఈ సినిమాకు సంబంధించి బాధ్యతలన్నీ బన్నీ వాసే చూసుకుంటాడని సమాచారం. గీతా ఆర్ట్స్-02 బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితం కానుందన్న మాట. లాక్ డౌన్ అవ్వగానే బన్నీ వాస్, శిరీష్ ఇద్దరూ ఫుల్ స్టోరీ విని ఆ తర్వాత అధికారిక ప్రకటన చేస్తారట. ఇక రెండో కథ విషయానికొస్తే.. బొమ్మరిల్లు భాస్కర్ ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా.. ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. అది రిలీజ్ అయ్యాక శిరీష్‌తో సినిమా చేస్తాడట. ఇది గీతా ఆర్ట్స్‌లోనే నిర్మితమవుతోందని సమాచారం.

ఆ లెక్కలే వేరు..

మొత్తానికి చూస్తే.. బన్నీని స్టార్ హీరోల్లో ఒకడిగా నిలిపిన అరవింద్ ఇప్పుడు శిరీష్‌పై ప్రత్యేక దృష్టిపెట్టడం ఒకింత మంచి పరిణామమే. ఈ విషయం తెలుసుకున్న మెగాభిమానులు, శిరీష్ అభిమానులు హమ్మాయ్యా.. మా అభిమాన హీరోకూ మంచి రోజులొస్తున్నాయ్ అని ఆనందంలో మునిగితేలుతున్నారట. వాస్తవానికి అరవింద్ సాదా సీదా కథల జోలికి వెళ్లడు.. వన్స్ వెళ్లాడంటే ఆ లెక్కలు వేరేలా ఉంటాయ్. మరి తాజాగా వస్తున్న ఆ రెండు కథల విషయంలో క్లారిటీగా ఉన్నాడంటే ఇక్కడ్నుంచే శిరీష్ రాత మారిపోతుందనే భావించాలి. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాలి.



By May 02, 2020 at 06:53PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/50870/mega-family.html

No comments