బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని.. ఒంగోలులో కలకలం
ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనివ్వడం ప్రకాశం జిల్లా ఒంగోలులో కలకలం రేపుతోంది. పట్టణానికి చెందిన ఓ బాలిక(16) అద్దంకిలోని ఓ కాలేజీ ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. ఆదివారం ఆమెకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అది కడుపునొప్పి కాదని, పురిటినొప్పులు అని గ్రహించిన డాక్టర్లు ఆమెకు ప్రసవం చేయగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. Also Read: ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి విచారించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మైనర్ బాలికకు ప్రసవం ఎలా చేస్తారని డాక్టర్లను నిలదీశారు. అయితే ఆమె వయసు 18 ఏళ్లని తల్లిదండ్రులు చెప్పడంతోనే తాము డెలివరీ చేశాడని డాక్టర్లు చెప్పారు. అయితే ఆ బిడ్డకు తండ్రి ఎవరు అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. బాలికకు ప్రేమ వ్యవహారం ఉందా? లేక ఎవరైనా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారా? అన్న కోణంలో విచారిస్తున్నారు. Also Read:
By May 25, 2020 at 09:59AM
No comments