భార్య, ఆమె చెల్లిపై కత్తితో దాడి.. గుంటూరులో దారుణం
కుటుంబ కలహాల నేఫథ్యంలో ఓ వ్యక్తి భార్య, ఆమె చెల్లెలిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన జిల్లా మండలం నారాయణపురంలో ఆదివారం జరిగింది. అదే గ్రామానికి చెందిన శివ, జానీ బేగం ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకొన్నారు. వీరికి నాలుగు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. అయితే ఇటీవల దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. Also Read: ఆదివారం సాయంత్రం వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆవేశానికి గురైన శివ కత్తితో భార్యను పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకోబోయిన ఆమె సోదరిపై కూడా కత్తితో దాడి చేశాడు. స్థానికులు బాధితులిద్దరినీ చికిత్స నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By May 25, 2020 at 11:28AM
No comments