Breaking News

భార్య వేరొకరితో తిరుగుతోందన్న అనుమానం.. కత్తితో నరికి చంపిన భర్త


ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని ఆమెకు కిరాతకంగా చంపేసని దుర్మార్గుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఆర్కేపీకి చెందిన పుల్లూరి సురేష్‌, మల్లికార్జున్‌నగర్‌కు చెందిన సంధ్యారాణిని కొన్నాళ్ల పాటు ప్రేమించి 2012లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ బాబు ఉన్నాడు. ఆ తర్వాత తాగుడుకు బానిసైన సురేష్‌ వరకట్నం కావాలంటూ సంధ్యారాణిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె 2013లో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. Also Read: పోలీసులు సురేశ్‌కు కౌన్సెలింగ్ ఇవ్వడంతో మార్పు వచ్చింది. భార్యను కొన్నాళ్ల పాటు బాగానే చూసుకున్న అతడిలో అనుమానం మొదలైంది. భార్య ఎవరితో ఫోన్లో మాట్లాడినా అక్రమ సంబంధాలు అంటగట్టి వేధించేవాడు. మానసికంగా, శరీరకంగా వేధింపులు తీవ్రం కావడంతో ఆమె మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పెద్దలు రాజీ కుదర్చడంతో ఇద్దరూ మళ్లీ కాపురం మొదలుపెట్టారు. Also Read: ఏప్రిల్ 28న మరోసారి గొడవ జరగడంతో సురేశ భార్యను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తన భార్య ప్రియుడిని కలిసేందుకే పుట్టింటికి వెళ్లిందని అనుమానపడిన సురేశ్ ఈ నెల 7వ తేదీన అక్కడికి వెళ్లాడు. సంధ్యారాణితో గొడవపడి వెంట తెచ్చుకున్న కత్తితో మొహం, ఛాతీ, వీపు భాగాల్లో విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో సంధ్యారాణి అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం సింగరేణి ఏరియా ఆస్పత్రి వద్ద చేపట్టిన తనిఖీల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. కత్తిని స్వాధీనం చేసుకుని సురేశ్‌ను రిమాండ్‌కు తరలించారు. Also Read:


By May 10, 2020 at 08:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-brutally-murdered-wife-in-telangana-arrested/articleshow/75653655.cms

No comments