కన్నకూతురిపైనే కామం.. కామారెడ్డిలో వార్డు మెంబర్ దారుణహత్య
కన్న కూతురిపైనే కన్నేసి కోరిక తీర్చాలంటూ వేధిస్తున్న వార్డు మెంబర్ కొడుకు చేతిలో దారుణహత్యకు గురైన ఘటన తెలంగాణలోని జిల్లాలో జరిగింది. భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన మైలయ్య అనే వ్యక్తి వార్డ్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నాడు. కూతురిపైనే కన్నేసిన మైలయ్య కోరిక తీర్చాలంటూ కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. కన్నతండ్రే లైంగికంగా వేధిస్తుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితురాలు తనలో తానే కుమిలిపోయేది. Also Read: చివరికి వేధింపులు భరించలేక తల్లి, అన్నకి విషయం చెప్పింది. కూతురినే వేధిస్తావా అంటూ వారిద్దరూ మైలయ్యను నిలదీశారు. అయితే అతడి తీరు మారకపోగా కూతురిని మరింతగా వేధించసాగాడు. దీంతో మైలయ్యను అతడి కొడుకు గురువారం గొడ్డలితో విచక్షణా రహితంగా నరికాడు. తీవ్ర రక్తస్రావంతో మైలయ్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Also Read:
By May 15, 2020 at 10:21AM
No comments