అమ్మాయి.. సె** అంటూ శ్రీ రెడ్డి రచ్చ.. బిగ్ బాస్ బ్యూటీకి స్ట్రాంగ్ కౌంటర్
సెక్సీ బ్యూటీ, సంచలన తార శ్రీరెడ్డి మరోసారి తనదైన స్టైల్ కామెంట్ చేస్తూ యంగ్ హీరోయిన్ నందినీ రాయ్‌పై కౌంటర్ వేసింది. విషయమై స్పందన చూసిన శ్రీరెడ్డి.. ముందు కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటో తెలుసుకో బుజ్జీ అని చెబుతూనే ఆమెపై సెటైర్స్ వేసింది. ఇలా ఈ ఇష్యూని మరోసారి హాట్ టాపిక్ చేస్తూ తన కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని సమర్ధించుకుంది . ఇటీవలే ఓ మీడియాతో ముచ్చటించిన హీరోయిన్, బిగ్ బాస్ ఫేమ్ నందినీ రాయ్.. క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదని ఐటీ కంపెనీలు సహా ఎక్కడైనా ఉందని చెప్పింది. ''వాళ్లను అడిగారు.. వీళ్లను అడిగారు అని ఇండస్ట్రీ గురించి చాలా మంది అంటుంటారు. నిజానికి అలా ఏం ఉండదు. అడిగేవాళ్లు అడుగుతారు. యస్ చెప్పడమా.. నో చెప్పడమా అనేది ఆ అమ్మాయి మీద ఆధారపడి ఉంటుంది. అది అమ్మాయి ఇష్టం. వెళ్లాలి అనుకుంటే వెళ్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి ఇష్టం లేకపోతే నో చెప్తుంది'' అని పేర్కొంది నందినీ రాయ్. దీంతో ఇది చూసిన శ్రీ రెడ్డికి చిర్రెత్తే కోపం వచ్చినట్లుంది. వెంటనే ఆమెకు కౌంటర్ వేస్తూ.. ముందు కాస్టింగ్ కౌచ్ అంటే అర్థం తెలుసుకో అనేలా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టేసింది. ''అవకాశం కోసం ఓ అమ్మాయి వచ్చినపుడు.. ఎవరైనా ఆమెను సెక్స్ కోసం బలవంతం చేస్తే అది కాస్టింగ్ కౌచ్ అవుతుంది నందిని. అలా కాకుండా అమ్మాయి డైరెక్టుగా నిర్మాతకు సెక్స్ ఆఫర్ చేస్తే అది కాస్టింగ్ కౌచ్ కాదు. అది నీకు బాగా తెలుసని నేను నమ్ముతున్నా మై ఫ్రెండ్'' అంటూ తన సందేశాన్ని పోస్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది శ్రీ రెడ్డి. Also Read: సినీ ఇండస్ట్రీలో మహిళలను లైంగికంగా దోచుకుంటున్నారంటూ కాస్టింగ్ కౌచ్ ఉద్యమం లేవనెత్తిన శ్రీ రెడ్డి.. అందరూ చూస్తుండగానే అర్దనగ్నంగా తన నిరసన తెలియజేసి అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కాస్టింగ్ కౌచ్ అంశంపై అందరు హీరోయిన్స్ స్పందిస్తున్నారు. అయితే కొందరు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చెబుతుండగా, ఇంకొందరు అలాంటిదేమీ లేదని అంటూ కొట్టిపారేస్తున్నారు.
By May 25, 2020 at 09:59AM
No comments