Breaking News

చమురు చౌకగా లభ్యమవుతున్న వేళ.. భారత్ తెలివైన నిర్ణయం!


కరోనా వైరస్ కట్టడి కోసం ప్రపంచంలోని పలు దేశాలు లాక్‌డౌన్ విధించడంతో చమురు ధరలు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. ఓ దశలో ధరలు మైనస్‌లోకి సైతం వెళ్లాయి. క్రూడ్ ఆయిల్ చౌకగా లభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లోనే సాధ్యమైనంతగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే మన దేశంలో చముురు నిల్వ కేంద్రాలు నిండిపోవడంతో.. విదేశాల్లో క్రూడ్ ఆయిల్ నిల్వ చేయాలని భావిస్తోంది. అమెరికాలో చమురును నిల్వ చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇప్పటికే ఆస్ట్రేలియా కూడా ఇదే బాటలో నడుస్తోంది. యూఎస్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్‌లో చమురు నిల్వ చేయడం కోసం ఎమర్జెన్సీ ఆయిల్ స్టాక్‌పైల్‌ను నిర్మించనున్నట్లు గత నెలలో ఆస్ట్రేలియా ప్రకటించింది. 2020లో చమురు ధరలు 40 శాతానికిపైగా తగ్గాయి. ఒపెక్ కూటమి సరఫరాను తగ్గించడంతో ఇటీవలే మళ్లీ ధరలు కొద్దిగా పెరిగాయి. ప్రపంచంలో చమురును ఎక్కువగా ఉపయోగిస్తోన్న, దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ధరలు తగ్గడంతో మన దేశం ఇప్పటికే 5.33 మిలియన్ టన్నుల చమురును మన దేశంలోని వ్యూహాత్మక నిల్వ కేంద్రాల్లో నిల్వ చేశారు. దాదాపు 9 మిలియన్ టన్నుల చమురు గల్ఫ్ సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నౌకల్లో నిల్వ ఉంచారు. భారత రిఫైనరీలు కూడా పూర్తి సామర్థ్యం మేర ఇంధనాన్ని నిల్వ చేశాయి. భారత వార్షిక వినియోగంలో 20 శాతానికిపైగా చమురును నిల్వ చేశామని ప్రధాన్ తెలిపారు. ప్రభుత్వం నూతనంగా చమురు నిల్వ కేంద్రాలను నిర్మించడానికి మన చమురు నిల్వ సామర్థ్యాన్ని 6.5 మిలియన్ టన్నులకు పెంచడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.


By May 26, 2020 at 11:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-mulling-to-store-cheap-oil-in-united-states/articleshow/75994978.cms

No comments