Breaking News

ప్రాణం తీసిన అప్పులు.. ఆర్థిక ఇబ్బందులతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య


ఆర్థిక ఇబ్బందులతో తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణలోని జిల్లా తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌ గ్రామంలో విషాదం నింపింది. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక, బిడ్డకు పెళ్లి చేసేందుకు డబ్బుల్లేక మనోవేదనకు గురైన తల్లి కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఎర్రాపహాడ్‌ గ్రామానికి చెందిన బద్దం లక్ష్మారెడ్డి, లింగమణి(42) దంపతులకు కుమారుడు రణదీప్‌ రెడ్డి, కూతురు శిరీష(18) ఉన్నారు. వీరు గ్రామంలో ఉన్న రెండున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. రణదీప్‌రెడ్డి హైదరాబాద్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తుండగా, శిరీష కామారెడ్డిలో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. Also Read: ఈ కుటుంబం గతేడాదిన కొత్త ఇంటిని నిర్మించుకుంది. ఈ క్రమంలోనే రూ.2లక్షలకు పైగా అప్పులు అయ్యాయి. వ్యవసాయంలో ఆదాయం అంతంతమాత్రంగానే ఉండటం, చేసిన అప్పులకు వడ్డీభారం పెరిగిపోతుండటంతో మానసికంగా నలిగిపోతున్నారు. దీనికితోడు కొడుకుకు కాలేజీ ఫీజు కట్టాల్సి రావడం, కూతురు పెళ్లీడుకు రావడంతో ఆ దంపతులు మానసికంగా నలిగిపోయారు. అప్పుల విషయమై ఆదివారం రాత్రి లక్ష్మారెడ్డి, లింగమణి దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరూ భోజనం చేయకుండానే పడుకున్నారు. సోమవారం ఉదయం లక్ష్మారెడ్డి పొలం పనులకు వెళ్లిపోగా.. తల్లీకూతుళ్లు ఇంటి వద్దనే ఉన్నారు. Also Read: అప్పుల బాధ భరించేకంటే చనిపోవడమే మేలని నిర్ణయించుకుని తమ పొలంలోని వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నారు. లక్ష్మారెడ్డి లేని సమయం చూసి ఇద్దరూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నీళ్లు తాగి తిరిగి వచ్చిన లక్ష్మారెడ్డికి భార్యా కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల చూశాడు. బావిలోకి చూడగా ఇద్దరి మృతదేహాలు తేలుతూ కనిపించాయి. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. Also Read:


By May 26, 2020 at 11:53AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mother-daughter-commits-suicide-in-kamareddy-district-ovet-debt-problems/articleshow/75994406.cms

No comments