Breaking News

ఆ క్షణం నా గుండె పగిలింది.. హృతిక్ రోషన్ పెళ్లిపై మీనా ఆవేదన


బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అమ్మాయిలు అయితే హృతిక్ అంటే పడిచచ్చిపోతారు. అయితే హృతిక్ రోషన్‌కు సెలబ్రిటీల్లో కూడా అభిమానులు ఉన్నారన్న విషయం తాజాగా తెలిసింది. బాలీవుడ్ హీరో అంటే తనకు చాలా ఇష్టమని ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ తెలిపింది. 2000లో హృతిక్ వివాహం తరువాత జరిగిన రిసెప్షన్ కు తాను వెళ్లానంది. అయితే ఆ సమయంలో అతన్ని అభినందిస్తున్నప్పుడు సాటి అమ్మాయిగా చాలా ఫీల్ అయ్యానని సీనియర్ నటి మీనా చెప్పింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా, అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకున్న మీనా, తన ఫేవరెట్ హీరో హృతిక్ అని పేర్కొంది. అయతే ఆయన పెళ్లి తరువాత బెంగళూరులో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో అతన్ని కలిసి అభినందించానంది. అయితే ఆ రోజు తన గుండె బద్ధలైందని చెబుతూ ఓ నవ్వుతున్న ఎమోజీని ఆమె పోస్ట్ చేసింది. దీంతో పాటు... హృతిక్ కు శుభాకాంక్షలు చెబుతున్న ఫోటోను సైతం మీనా షేర్ చేశారు. అయితే మీనా చేసిన పోస్టుపై ఓ నెటిజన్ స్పందిస్తూ... ‘విలన్’ సినిమాలోని పాటలో హీరో అజిత్‌తో కలిసి మంచులో మీరు చేసిన డ్యాన్స్‌ను హృతిక్‌ ప్రశంసించారు. ఆ ఆర్టికల్‌ నేను చదివా అంటూ పోస్టు చేశారు. దీనిపై కూడా మీనా స్పందించారు. ఆ పాట షూటింగ్ మంచులో జరిగిందని ఆ సమయంలో హృతిక్ తో పాటు అమితాబ్, కరీనా కపూర్ లు కూడా అక్కడే ఉన్నారని గుర్తు చేసుకున్నారు. దట్టంగా మంచు కురుస్తుంటే షూటింగ్ ఆపకుండా మేం షూట్ చేస్తుంటే.. మా అంకితభావం చూసి వాళ్లు మెచ్చుకున్నారన్నారు. ఈ సందర్భంగా కరీనా కపూర్ తల్లి తనను తిట్టారని గుర్తు చేసుకున్నారు. ప్రతి షాట్‌ తర్వాత హాట్‌ చాకొలెట్‌ తినమని చెప్పారన్నారు.


By May 17, 2020 at 10:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-meena-heart-broke-when-hrithik-roshan-is-going-to-wedding/articleshow/75784660.cms

No comments