Breaking News

బాహుబలి గెటప్‌లో డేవిడ్ వార్నర్ టిక్ టాక్


బాహుబలి గెటప్‌లో స్టార్ క్రికెటర్ మెరిశాడు. గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా క్రికెటర్ తెలుగు సినిమాలపై మనసు పారేసుకున్నాడు. అల వైకుంఠపురములో సినిమా పాటలకు టిక్ టాక్ వీడియోలు చేశాడు. బుట్టబొమ్మ పాటకు తన భార్యతో కలిసి డాన్స్ వేశాడు. ఇక దాని తర్వాత రాములో రాములా పాటకు కూడా స్టెప్పులేశాడు. అంతేకాదు కమల్ హాసన్ పాటకు కూడా డాన్స్ చేశాడు. ఇక మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ పోకిరి సినిమాలో డైలాగ్స్ కూడా చెప్పాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ టిక్ టాక్ చేశాడు. లాక్‌డౌన్ వలన ఇంటికే పరిమితమైన ఆయన కొద్ది రోజులుగా టిక్ టాక్ వీడియోలు చేస్తూ అలరిస్తున్నారు. అయితే ఎక్కువగా మన తెలుగు సినిమాలకి సంబంధించి వీడియోలు చేయడం విశేషం. తాజాగా వార్నర్.. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' సినిమాలోని అమరేంద్ర బాహుబలి అనే నేను డైలాగ్‌ను టిక్‌టాక్ వీడియోగా చేసి రిలీజ్ చేసాడు. ఈ డైలాగ్ కోసం ఏకంగా బాహుబలి కాస్ట్యూమ్ ధరించి అందరిని అలరించాడు. ఈ వీడియోలో వార్నర్ కూతురు కూడా మెరిసింది.ఇక ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్‌గా మారింది. IPLలో తెలుగు ఫ్రాంచైజీ ‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌’కు వార్నర్‌ కెఫ్టెన్సీ వహిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా అతడికి హైదరాబాద్‌తో అనుబంధం ఏర్పడింది. ఇక్కడి సంస్కృతి, ఆహారం, ప్రదేశాలు ఆయనకు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ ముప్పుతో లాక్‌డౌన్‌ అమలు చేయడంతో ఐపీఎల్‌ 2020 వాయిదా పడింది. అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచులు సైతం జరగడం లేదు. దీంతో క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నారు. ముఖ్యంగా వార్నర్ తెలుగు ప్రేక్షకులకు టచ్‌లో ఉండేందుకు ఇా కొత్త కొత్తగా టిక్ టాక్‌ వీడియోలు చేస్తున్నాడు. వార్నర్ వీడియోపై తెలుగు సినీ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. అల్లు అర్జున్, పూరి జగన్నాథ్... వార్నర్ పోస్టులకు రిప్లై కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.


By May 17, 2020 at 10:13AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/david-warner-latest-tiktok-on-prabhass-famous-bahubali-dialogue/articleshow/75784354.cms

No comments