పనివాడితో అఫైర్.. భర్తను చంపి ప్రియుడితో పరార్.. ఏలూరులో దారుణం
అక్రమ సంబంధం మోజులో పడిన ఓ వివాహిత ప్రియుడి సాయంతో కట్టుకున్న భర్తనే చంపేసిన ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. ఏలూరులో నివాసముంటున్న గుడిపూడి నాగరాజుకు (38), భూలక్ష్మికి ఏడేళ్ల కిందట వివాహమైంది. నాగరాజు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. పెదపాడు మండలం వట్లూరు సమీపంలో తాపీపనులు చేస్తూ కుటుంబంతో సహా అక్కడే నివాసముంటున్నాడు. అతని వద్ద అదే గ్రామానికి చెందిన తోకల సురేష్ అనే యువకుడు పనిచేస్తూ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో నాగరాజు భార్య భూలక్ష్మికి, సురేష్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. Also Read: తాను ఇంట్లో లేని సమయంలో సురేష్ వచ్చి వెళ్తున్నాడని తెలుసుకున్న నాగరాజు నిఘా పెట్టగా అక్రమ సంబంధం బయటపడింది. పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. దీంతో తమ బంధానికి అడ్డొస్తున్న నాగరాజు ఎలాగైనా చంపేయాలని ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు. ఈ నెల 6న రాత్రి నాగరాజు నిద్రపోతున్న సమయంలో భూలక్ష్మి, సురేష్ ఇనుప రాడ్డుతో అతని తలపై బలంగా మోది చంపేశారు. అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తెల్లవారితే ఈ విషయం అందరికీ తెలిసిపోతుందన్న భయంతో ఇద్దరూ పరారయ్యారు. Also Read: గురువారం ఉదయం ఇంట్లో నాగరాజు విగతజీవిగా పడి ఉండటాన్ని గమినించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. త్రీటౌన్ సీఐ మూర్తి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశాడని, నిందితుల కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తనే చంపేసిన భూలక్ష్మిపై స్థానికులు మండిపడుతున్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. Also Read:
By May 08, 2020 at 08:45AM
No comments