75ఏళ్ల వయస్సులో ఆరేళ్ల బాలికతో పాడుపని.. వృద్ధుడిపై కేసు
జిల్లా లక్కవరపుకోట మండలంలో దారుణ ఘటన జరిగింది. ఆరేళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని ఓ గ్రామంలో 75 ఏళ్ల వృద్ధుడు పాకలో ఒంటరిగా నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన బాలిక(6) ఆడుకుంటూ ఆ పాక సమీపానికి వచ్చింది. ఆమెపై కన్నేసిన ఆ వృద్ధుడు బాలికను పాకలోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ బాలుడు పరుగున వెళ్లి బాలిక తల్లిదండ్రులకు చెప్పాడు. Also Read: దీంతో బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వృద్ధుడి బారి నుంచి చిన్నారిని కాపాడి బయటకు తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి ఎల్.కోట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ ప్రయోగమూర్తి గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాటికి కాళ్లు చాపుకున్న వయస్సులో వృద్ధుడికి ఇదేం పాడు బుద్ధి అని గ్రామస్థులు మండిపడుతున్నారు. Also Read:
By May 08, 2020 at 08:21AM
No comments