Breaking News

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులపై దుర్భాషలు.. బ్యాంక్ ఉద్యోగినిపై కేసు


చెక్‌పోస్ట్ వద్ద అడ్డంగా పార్క్ చేసిన కారును తీయమన్నందుకు ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడిన బ్యాంక్ ఉద్యోగినిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఖైరతాబాద్‌ చౌరస్తాలో నాలా పక్కనే పోలీసు చెక్‌పోస్ట్‌ ఉంది. అక్కడ రాత్రి సమయంలో వాహనాలను తనిఖీ చేసేందుకు ఏసీపీ గోవర్ధన్‌, ఇన్‌స్పెక్టర్‌ ఎం. రవి సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తున్నారు. చెక్‌పోస్ట్‌ వద్ద 900 వాహనాలను తనిఖీ చేయగా.. అందులో 150 వాహనాలు అనుమతులు లేకుండా తిరుగుతున్నాయని గుర్తించి సీజ్ చేశారు. ఈ తనిఖీల వద్ద ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగిని ఫ్రెండ్‌తో కలిసి అక్కడికి వచ్చింది. రోడ్డుపైనే కారు నిలిపి కుక్కలకు ఆహారం వేస్తోంది. Also Read: ఆమెను గమనించిన ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నిలిపి ఉంచిన కారును తీయాలని సూచించారు. దీంతో ఆమె రెచ్చిపోయి దురుసుగా ప్రవర్తించింది. దీంతో వాహనానికి ‘అనుమతి ఉందా అని అడగగా అసభ్య పదజాలంతో దూషించింది. నన్ను ఆపేందుకు మీరెవరు.. మీ సంగతి తేలుస్తానంటూ’ దుర్భాషలాడింది. ఆ తతంగాన్ని గమనించిన ఏసీపీ అక్కడికి వెళ్లి మాట్లాడగా.. నన్ను ప్రశ్నించేందుకు నువ్వెవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మరింత రెచ్చిపోవడంతో పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏసీపీ తిరుపతన్న సిబ్బందితో అక్కడికి వెళ్లి ఆమెకు నచ్చజెప్పి పంపించారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారిని దుర్భాషలాడినందుకు మహిళపై కేసు నమోదు చేశారు. Also Read:


By May 08, 2020 at 11:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/case-booked-on-bank-employee-over-argument-with-hyderabad-traffic-police/articleshow/75618239.cms

No comments