Breaking News

సెక్సీగా కనిపించడంతో అందరూ!! పెద్ద పొరపాటు జరిగింది.. రష్మీ కామెంట్స్


యాంకర్ రష్మీ.. ఈ హాట్ బ్యూటీకి స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ ఉంది. సినిమాల్లో సక్సెస్ కాకపోయినప్పటికీ బుల్లితెరపై హంగామా చేస్తోంది గౌతమ్. యాంకరింగ్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్న ఈమె.. పలు బుల్లితెర కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ గ్లామర్‌ ఒలకబోస్తోంది. ముఖ్యంగా జబర్దస్త్ బ్యూటీగా సూపర్ పాపులారిటీ సంపాదించింది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను సినిమాల్లో సక్సెస్ కాకపోవడానికి గల కారణాలు చెప్పింది రష్మీ. గ్లామరస్ యాంకర్‌గా బుల్లితెరపై ఎవర్‌గ్రీన్‌ అనిపించుకున్నా గానీ వెండితెరపై సినిమాలు సెలెక్ట్ చేసుకోవడంలో తప్పుచేసి సక్సెస్ కాలేకపోయానని అంటోంది రష్మీ గౌతమ్. మొదట చిన్నచిన్న పాత్రల్లో మెరిసిన ఆమె.. ఆ తర్వాత ‘గుంటూరు టాకీస్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ యువ ఆడియన్స్ అందరినీ బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేసింది. కానీ అది వర్కవుట్ కాలేదు. బుల్లితెరపై రాణిస్తున్నా వెండితెర మాత్రం ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. కాగా తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన రష్మీ.. బుల్లితెరపై తనకున్న క్రేజ్ వెండితెరపై అవకాశాలను తెచ్చిపెట్టిందని, దాంతో ఒక్కో సినిమా చేస్తూ వెళ్లానని చెప్పింది. ఈ క్రమంలోనే 'గుంటూరు టాకీస్' సినిమా చేశానని, అయితే ఆ మూవీలో గ్లామర్ డోస్ ఎక్కువగా వడ్డించి సెక్సీ లుక్‌‌లో కనిపించడమే దెబ్బేసిందని చెప్పుకొచ్చింది. అలా చూసిన దర్శకనిర్మాతలంతా మళ్ళీ అలాంటి రోల్స్ మాత్రమే ఆఫర్ చేశారని తెలిపింది. Also Read: దీంతో ఒకే తరహా రోల్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వైవిధ్యభరితమైన పాత్రలను చేయాలనే తన ఆశ నిరాశ గానే మిగిలిపోయిందని రష్మీ చెప్పింది. ఆ పాత్ర ఒప్పుకుని తాను పెద్ద తప్పు చేశానని, ఇకపై అలాంటి పాత్రలను ఒప్పుకునేదే లేదని స్పష్టం చేసింది. ఇకపోతే మరో జబర్దస్త్ బ్యూటీ అనసూయ మాత్రం బుల్లితెరతో పాటు వెండితెర జోష్ కూడా కొనసాగిస్తోంది. చూడాలి మరి ఇకనైనా రష్మీకి కోరుకున్న రోల్స్ వస్తాయా? రావా? అనేది.


By May 08, 2020 at 11:42AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rashmi-gautam-told-her-mistakes-in-silver-screen-journey/articleshow/75618837.cms

No comments