పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. లైంగిక కోరికలు తీర్చుకుని


ప్రేమ పేరుతో వెంటపడి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి తప్పించుకుని తిరుగుతున్న యువకుడిపై కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా పోరంకికి చెందిన మెర్నీడి జయరామకృష్ణ విజయవాడలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అదే సంస్థలో గుంటూరు జిల్లా చెరుకుపల్లికి చెందిన ఓ యువతి పని చేస్తోంది. వారిద్దరికీ కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. Also Read: యువతిపై కన్నేసిన జయరామకృష్ణ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి నమ్మించాడు. కొద్దిరోజులు కలిసి తిరిగాక పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా ప్రియురాలిని గదికి తీసుకెళ్లి లైంగిక కోరికలు తీర్చుకునేవాడు. ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకోవాలని యువతి కోరింది. అప్పటి నుంచి జయరామకృష్ణ ఆమె కంటపడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు కృష్ణా జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు జయరామకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By May 18, 2020 at 09:38AM
Post Comment
No comments