కోడికత్తితో ప్రియుడి గొంతు కోసిన యువతి అన్న.. వీడిన చీరాల మర్డర్ మిస్టరీ
ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. ఈ నెల 8న తోటవారిపాలెంలో జరిగిన యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లికి చెందిన ఓ యువతిచీరాలలోని హారిస్‌పేటలోని ఓ ప్రార్థనా మందిరానికి ప్రతి ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి వచ్చేది. ఈ క్రమంలో హ్యారిస్‌పేటకు చెందిన ఎన్.దినేష్ అనే యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. Also Read: ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో పలుమార్లు దినేష్‌ను హెచ్చరించారు. వారి మాట పట్టించుకోని దినేష్ యువతి చదువుతున్న కాలేజీతో పాటు ఆమె ఇంటి వద్ద తిరుగుతుండేవాడు. దీన్ని అవమానంగా భావించిన యువతి కుటుంబీకులు ఎలాగైనా అతడిని అంతమొందించాలని ప్రణాళిక వేశారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సదరు యువతి, ఆమె అన్న వంశీ, అతడి ప్రియురాలు రోజూ దినేష్‌తో ఫోన్లో మాట్లాడుతున్నారు. దినేష్ సెల్‌ఫోన్ పాడైన విషయం తెలుసుకుని... తమ వద్ద ఉన్న ఫోన్ ఇస్తామని చెప్పి ఈ నెల 8వ తేదీన వెదుళ్లపల్లి రావాలని చెప్పారు. వారి మాట నమ్మిన దినేష్ ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై బయలుదేరాడు. వారు తోటవారిపాలెం కృపానగర్ వద్దకు రాగానే వంశీ, అతని ఫ్రెండ్స్ దుర్గారావు, మరో బాలుడు కలిసి దినేష్‌ను అడ్డగించారు. Also Read: వంశీ తన వద్ద ఉన్న కోడికత్తితో దినేష్ మెడకింద భాగంలో బలంగా పొడవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో అతడి వెంట వచ్చిన ఫ్రెండ్ భయంతో పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం ఆటోనగర్ బైపాస్ వద్ద వంశీ, అతడి ఫ్రెండ్ దుర్గారావు, ప్రియురాలితో పాటు మరో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు కోడి కత్తులు, సెల్‌ఫోన్లు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ముగ్గురిని కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు. మైనర్ బాలుడిని ఒంగోలు జువైనల్ కోర్టుకు తరలించనున్నట్లు చెప్పారు. ఈ కేసులో దినేష్ ప్రియురాలితో పాటు ఆమె తండ్రి రాజేష్‌ను కూడా అరెస్టు చేయాల్సి ఉందని, పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. Also Read:
By May 25, 2020 at 12:09PM
No comments