ఎంతో ఓపికగా విని అలా రియాక్ట్ అయ్యారు.. సీఎం కేసీఆర్‌పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలకు పైగా కెమెరాలన్నీ మూలనపడ్డాయి. షూటింగ్స్ లేక సినీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో నాగులో దశ లాక్‌డౌన్‌లో భాగంగా కొన్ని రంగాలకు మినహాయింపు ఇవ్వడంతో సినీ రంగాన్ని కూడా అందులో చేర్చాలని, కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ రీ ఓపెన్ చేసుకుంటామని సీఎం వద్దకు అభ్యర్థన తీసుకెళ్లారు సినీ పెద్దలు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గురువారం రోజు ప్రగతిభవన్‌లో కలిసిన సినీ ప్రముఖులు.. షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్ తదితర అంశాలపై చర్చించారు. Also Read: ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు, సహా పలువురు సినీ పెద్దలు పాల్గొన్నారు. సినీ ప్రముఖులు తెలిపిన విషయాలన్నింటి విన్న కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ.. తెలుగు చిత్రసీమకు ఊరటనిచ్చేలా త్వరలోనే అఫీషియల్ ప్రకటన జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన హామీ పట్ల సెలబ్రిటీలందరూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ‘‘సినిమా షూటింగ్స్ రీ ఓపెన్ విషయమై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మేం చెప్పిన ప్రతి విషయం ఎంతో ఓపికగా విని సానుకూలంగా స్పందించారు. మనందరికీ ఊరటనిచ్చే ప్రకటన అతి త్వరలో జారీ చేస్తామని హామీ ఇచ్చారు. దీనిని సీఎంగారి దృష్టికి తీసుకెళ్లడానికి తోడ్పాటునందించిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసానిగారికి ధన్యవాదాలు’’ అని రాజమౌళి ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.
By May 23, 2020 at 09:27AM
No comments